నర్తనశాల రివ్యూ

407

తారాగణం: నాగ శౌర్య, యామిని భాస్కర్, కష్మీర, శివాజీరాజా తదితరులు

నిర్మాణ సంస్థ: Ira క్రియేషన్స్

సంగీతం: మహతి స్వర సాగర్

ఛాయాగ్రహణం: విజయ్ సీ కుమార్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

నిర్మాత: ఉష

రచన-దర్శకత్వం: శ్రీనివాస చక్రవర్తి

CB రేటింగ్: 2.5/5 [yasr_overall_rating size=”medium”]

తన హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో ఛలో తో హిట్ అందుకున్న నాగశౌర్య రెండో ప్రయత్నంగా @నర్తనశాల అనే సినిమా చేసాడు.అసలే సొంత ప్రొడక్షన్,పైగా కొత్త డైరెక్టర్,ముందే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్….వీటికి తోడు భయంకరమయిన పబ్లిసిటీ తో నర్తనశాల కు ఫుల్ బజ్ వచ్చింది.అలా ఫుల్ పోజిటివిటీ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :ఈ సినిమా కథ విషయానికి వస్తే కళామందిర్ కళ్యాణ్ కి ఆడపిల్ల అంటే ఇష్టం.అందుకే పాపను కనాలి అనుకుంటాడు.కానీ అబ్బాయి పుట్టడంతో చిన్నతనంగా నుండి నుండి అతన్ని అమ్మయిలా రెడీ చేసి పెంచుతాడు.పెద్దయ్యాక ఆడవాళ్లకు సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ ఇచ్చే సెంటర్ స్టార్ట్ చేసిన నాగశౌర్య మానస ను చూసి,ఆమె ప్రొబ్లెమ్స్ తెలుసుకుని వాటిని సాల్వ్ చేసే ప్రాసెస్ లో ఆమెతో లవ్ లో పడతాడు.ఆమె కూడా అతన్ని లవ్ చేస్తుంది.కానీ అతని తండ్రి కళ్యాణ్ చేసిన పనివల్ల శౌర్య క్రూరుడు అయిన జయప్రకాష్ రెడ్డి కూతురుని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.దాంతో తాను గే అని అబద్దం ఆడతాడు శౌర్య.దానివల్ల అతను ఫేస్ చేసిన ప్రొబ్లెమ్స్ ఏంటి?,చివరికి మానస శౌర్య ఒక్కటయ్యారా లేదా వంటి అంశాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:ఈ సినిమా మూలకథలోనే ఒక ఫాల్ట్ ఉంది.అందుకే సినిమా ఎండింగ్ లో వచ్చే ఫైట్ కాస్త ఇంటర్వెల్ లో చేస్తే సరిపోయేదిగా ఎందుకు సినిమాని ఇలా డ్రాగ్ చెయ్యడం అనిపించింది.సినిమా లో ప్రతి రెండు మూడు సీన్స్ కి ఒక కథ రావడం మళ్ళీ వెంటనే అది పూర్తయిపోవడం…..సినిమా ఇలా సాగడంతో అసలు కథ ఎప్పుడు మొదలవుతుంది అనిపించింది.తీరా ఇంటర్వెల్ లో మెయిన్ కథ మొదలయ్యాక అది కూడా ఏ మాత్రం కొత్తదనం లేని ముతకసరుకు అని తేలడానికి ఎక్కువటైం పట్టలేదు.సినిమా అంతా కేవలం కామెడీ తో నింపెయ్యాలని ప్రయత్నం మాత్రమే జరిగినట్టు అనిపించింది.అది కూడా పదేళ్ల క్రితం ఓల్డ్ స్టైల్ హౌస్ కామెడీ.దాంతో అది కూడా తేలిపోయింది.కాస్త గ్లామరస్ గా ఉండే యంగ్ హీరో నాగ శౌర్య ని ఎక్కడా పూర్తిగా వాడుకోలేదు.వాళ్ళ క్యారెక్టర్స్ అయితే బొత్తిగా గెస్ట్ క్యారెక్టర్స్ లా అనిపించాయి.ఓవర్ ఆల్ గా నవ్వించి పాస్ అయిపోవాలి అని ఈ సినిమా టీమ్ చేసిన ప్రయత్నం కొంతవరకు కూడా వర్క్ అవుట్ కాలేదు.ఈ సినిమాకి నర్తనశాల అనే క్లాసిక్ టైటిల్ పెట్టడం ఇంకో తప్పు.
.
నటీనటుల విషయానికి వస్తే ఛలో సినిమాలో యూత్ ఫుల్ క్యారెక్టర్ లో ఒదిగిపోయిన నాగశౌర్య ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం తనకు నప్పని,నటించడానికి కూడా పెద్దగా స్కోప్ లేని సినిమాను ఎంచుకున్నాడు.అందుకే పాటలు,క్లయిమాక్స్ ఫైట్ మినహాయిస్తే ఎక్కడా కూడా అతను హీరో అని కన్వే కాలేనంత పలుచగా ఉంది అతని క్యారెక్టర్ డిజైనింగ్.ఇక కొత్త అమ్మాయి కశ్మీరా లుక్స్ పరంగా బావుంది.కానీ నటించడానికి పెద్దగా స్కోప్ లేదు.ఇక మరో హీరోయిన్ యామిని పరిస్థితి కూడా అంతే.సినిమా అంతా శివాజీరాజా,జయప్రకాష్ రెడ్డి ల పై నడించింది.అయితే కళామందిర్ కళ్యాణ్ గా కాస్త నవ్వులు పంచిన శివాజీరాజా,ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసాడు అనిపించింది.జయప్రకాశ్ రెడ్డి మాత్రం తనకు అలవాటయిన రాయలసీమ యాస లో కామెడీ డైలాగ్స్ చెబుతూ పర్లేదు అనిపించే కామెడీ పండించాడు.ఇక జెమినీ సురేష్,జబరదస్త్ రాఘవ,వైవా రాఘవ,అజయ్ తదితరులు కామెడీ పండించడానికి తమ వంతు ప్రయత్నం చేసారు.మిగతా నటీనటులంతా పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే తొలి సినిమా ని డైరెక్టర్ చేస్తున్న శ్రీనివాస చక్రవర్తి ఎప్పుడూ హిట్ అయ్యి అరిగిపోయిన పాత ఫార్మాట్ ని ఎంచుకున్నాడు.పైగా సినిమా మొత్తానికి బేస్ అయిన థ్రెడ్ ఒక్కటికూడా లేదు.ఎప్పటికప్పడు కొత్త కథ మొదలవ్వడం,అది ఎండ్ అయ్యి మళ్ళీ ఇంకో కొత్తకథ స్టార్ట్ అవ్వడం అలా సాగిపోయింది.ఇంటర్వెల్ వరకు నర్తనశాల అనే సబ్జెక్టు టచ్ చెయ్యలేదు అంటే సినిమాని ఎంత సేఫ్ సైడ్ గా నడిపించారో అర్ధం అవుతుంది.కోట డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి పూర్తిగా నిరాశపరిచాడు.ఇక ఛలో కి ఒకే ఒక్క సాంగ్ తో జీవం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ ఈ సినిమాలో కూడా కేవలం ఒకే ఒక్క పాట కాస్త చెప్పుకునేలా ఇచ్చాడు.మిగతా సాంగ్స్ స్క్రీన్ పై చాలా గ్రాండ్ గా ఉన్నాయి,కానీ వినడానికి మాత్రం సరిపడా స్టఫ్ లేదు.సినిమాటోగ్రాఫర్ విజయ్.సి.కుమార్ తన ప్రతిభతో నర్తనశాల ని చాలా గ్రాండ్ గా తీర్చిదిద్దాడు.అతని వర్క్ మెప్పిస్తుంది.ఎడిటింగ్ లో లేపెయ్యల్సిన లౌడ్ కామెడీ చాలా ఉంది ఈ సినిమాలో.ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

చివరిగా: మన ఇండస్ట్రీ లో గే కామెడీ ని ఎంచుకోవడం ఒక సాహసం అయితే దాన్ని సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేక ఒక రొటీన్ కామెడీ గా మార్చెయ్యడం విచారించదగ్గ విషయం.ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి రాసుకున్నప్పడు ఈ కథ కొత్తదే కావచ్చు.ఇప్స్ మాత్రం పక్కా అవుట్ డేటెడ్.కథలేక అనేక పక్కదార్లు పట్టారు.బి,సి సెంటర్స్ లో సైతం ఒక మోస్తరుగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు నెగ్గుకొస్తుందో చూడాలి.