పేపర్ బాయ్ రివ్యూ

393

చిత్రం : ‘పేపర్ బాయ్’

నటీనటులు: సంతోష్ శోభన్ – రియా సుమన్ – తన్య హోప్ – పోసాని కృష్ణమురళి – బిత్తిరి సత్తి – విద్యుల్లేఖ – మహేష్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్
కథ – స్క్రీన్ ప్లే – మాటలు: సంపత్ నంది
నిర్మాతలు: సంపత్ నంది – రాములు – వెంకట్ – నరసింహ
దర్శకత్వం: జయశంకర్

CB రేటింగ్: 2.5/5  

స్టార్ హీరోలతో సినిమాలు చేసే సంపత్ నంది మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు చిన్న బడ్జెట్ లో సేఫ్ గా ఉండే చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడు.కాకపోతే స్వతహాగా రైటర్ కాబట్టి వాటికి కథ దగ్గర నుండి మాటలవరకు తన పేరు వేసుకుని దాన్ని పెట్టుబడిగా బండి నడిపించేస్తాడు.ఇప్పడు కూడా యంగ్ హీరో సంతోష్ శోభన్ తో అలాంటి ఒక లవ్ స్టోరీ తెరకెక్కించాడు.అదే పేపర్ బాయ్.ఈ సినిమాని అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి ముందుకు రావడంతో పేపర్ బాయ్ కి విపరీతమయిన బజ్ వచ్చింది.ట్రైలర్ తో ఒక క్యూట్ లవ్ స్టోరీ అంతో హింట్ ఇచ్చిన టీమ్ సినిమాలో ఒక ట్విస్ట్ కూడా ఉందంటూ చెప్పుకొచ్చింది.మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది,ఈ పేపర్ బాయ్ ప్రేక్షకులను ఎలా అలరించాడు అనేది ఇప్పడు చూద్దాం

ఈ సినిమా కథ విషయానికి వస్తే పేపర్స్ వేసుకుంటూ తన ఇంటిని పోషించుకునే రవి కి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం.అయితే అతను అదే పుస్తకాలద్వారా ధరణి అనే అమ్మాయి భావాలగురించి తెలుసుకుని ఆమెతో ప్రేమలో పడతాడు.తరువాత అతనితో జరిగిన ట్రావెల్ లో రవి గురించి తెలుసుకుని ధరణి కూడా అతన్ని ప్రేమిస్తుంది.అదే విషయాన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్ళికి కూడా ఒప్పిస్తుంది.కానీ ఆ పెళ్లి ధరణి వాళ్ళ అన్నయ్యలకు ఇష్టం ఉండదు.దాంతో వాళ్ళు ఆ పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు క్రియేట్ చేసారు?,వాటివల్ల రవి,ధరణి విడిపోయారా లేకా కలిసి వాళ్ళ ప్రేమను గెలిపించుకున్నారా వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

ఈ సినిమా పాయింట్ బాగా పాతదే.కానీ దాన్ని సంపత్ నంది డీల్ చేసిన విధానం,అతని రైటింగ్ ద్వారా పొయెటిక్ గా చెప్పడం వల్ల మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది.ఫస్ట్ హాఫ్ వరకు అలా అలా అక్కడక్కడా అలరిస్తూ,మధ్య మధ్యలో సాగదీస్తూ  కూల్ గా నడచిపోయింది.కానీ సెకండ్ హాఫ్ కి వచ్చిన తరువాత అసలు నస మొదలయింది.లవ్ ట్రాక్ లో ఆల్ ఈజ్ వెల్,ఇంట్లో కూడా పెళ్ళికి ఒప్పేసుకున్నారు,దాంతో వాళ్ళు సాంగ్ కూడా వేసుకున్నారు.కానీ హీరోయిన్ అన్నలు ఆ పెళ్లిని డైజెస్ట్ చేసుకోలేక విలన్స్ గా మారడం,అక్కడినుండి సాగిన ఓవర్ డ్రమటిక్ సీన్స్ తో ఇమాపాక్ట్ తగ్గిన పేపర్ బాయ్ చివరికి వచ్చేసరికి ఏ ప్రత్యేకత లేకుండా నిలుచుండిపోయాడు.వాళ్ళు కలవడం అనే లాంఛనం కూడా చాలా మామూలుగా పూర్తయింది.

ఈ సినిమాలో హీరో సంతోష్ శోభన్ చాలా నేచురల్ గా నటించాడు.ఎక్కడా తడబాటు లేకుండా కూల్ గా అనిపించాడు.గత సినిమాతో పోలిస్తే స్క్రీన్ ప్రెజన్స్ కూడా మెరుగుపడింది.ఇక హీరోయిన్ ప్రియా శ్రీ కూడా క్యూట్ గా అనిపించింది.వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంది.ఇక బిత్తరి సత్తి పాత్ర ఫోర్సింగ్ గా అనిపించినా కూడా విద్యుల్లేఖ తో కలిసి అతను పండించిన కామెడీ కాస్త నవ్వించింది.పోసాని,నాగినీడు లాంటి నటులను పెట్టడం వల్ల సినిమా స్టార్ కాస్ట్ పరంగా కాస్త పెద్దదిగా అయ్యింది.అంతకుమించి ఎలాంటి ఇంపాక్ట్ కూడా లేదు.మిగతా నటీనటులు కూడా క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా నటించారు.

ఈ సినిమాకి కర్త,కర్మ,క్రియ అయిన సంపత్ నంది తనవరకు ఈ సినిమాకోసం బాగానే కష్టపడ్డాడు.కానీ సెకండ్ హాఫ్ లో కథ గాడి తప్పింది,అక్కడ పడిన సన్నివేశాలలో ఎలాంటి ఇంపాక్ట్ కూడా లేదు.ఇక క్లయిమాక్స్ అయితే వేరే సినిమాలు గుర్తు చేస్తూ హడావిడిగా ముగించినట్టు అనిపించింది.మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మంచి  ఫీల్ ఉన్న సాంగ్స్ ఇచ్చాడు.సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరించింది.ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా కూడా ఉన్న DOP సౌందర రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్.సినిమా డైరెక్టర్ జయశంకర్ అక్కడక్కడా తన దర్శకత్వ ప్రతిభ చూపించినా సెకండ్ హాఫ్ లో మాత్రం రైటింగ్ లాగే లైటర్ గా సినిమాని నడిపించేసాడు.మిగతా టెక్నీషియన్స్ అంతా డీసెంట్ అవుట్ ఫుట్  ఇచ్చారు.

ఒక క్యూట్ లవ్ స్టోరీ గా నిలబడాల్సిన ఈ సినిమా సింగిల్ పాయింట్ స్టోరీ కావడం,అలాగే నిలకడ లేమితో మధ్యలో గాడితప్పింది.దాంతో ప్రేమకథలకు ప్రాణమయిన గాఢత లోపించింది.ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు అనిపించినా కూడా సెకండ్ హాఫ్ పూర్తయ్యేసరికి పూర్తిగా రొటీన్ ట్రాక్ లో నడిచి ఒక యావరేజ్ మూవీ గా నిలిచిపోయింది.