విడుదల తేదీ ఖరారు చేసుకున్న కామెడి మూవీ !

78
MyDearMarthandam
MyDearMarthandam

నూతన దర్శకుడు హరీష్ కెవి దర్శకత్వంలో కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కథానాయకుడిగా వస్తున్న చిత్రం ‘మైడియర్ మార్తాండం’. ఈ చిత్రంలో రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డిలు ముఖ్య తారాగణంగా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ విడుదల చేశారు.

కాగా ఈ సందర్భంగా సందీప్ వంగ మాట్లాడుతూ.. తను మాట్లాడుతూ ట్రైలర్ చూస్తుంటే ఔట్ అండ్ ఔట్ కామెడీ గా సినిమా తెరకేక్కినట్టు కనపడుతుంది. ట్రైలర్ చాలా బాగుంది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.., అని అన్నారు.

హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ మా సినిమా పుల్ లేన్త్ కామెడి సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కించాం. చాలా బాగుంటుందని తెలిపారు. దర్శకుడు హరీష్ కె.వి మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది, కోర్ట్ రూమ్ డ్రామా, కామేడి ఇంటరాగేషన్స్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది, ఈ డిసెంబర్ 29న వస్తున్నాం.