సమీక్ష : అరవింద సమేత వీర రాఘవ

417
NTR, Aravinda Sametha,
NTR, Aravinda Sametha,

విడుదల తేదీ : అక్టోబర్ 11, 2018
CB రేటింగ్ : 3.5/5
నటీనటులు : ఎన్టీఆర్, పూజా హెగ్డే, సునీల్, జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బా, రావు రమేష్ తదిత‌రులు.
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : కె రాధకృష్ణన్
సంగీతం : యస్ తమన్
సినిమాటోగ్రఫర్ : పి.యస్ వినోద్
స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్ శ్రీనివాస్

మాటలమాంత్రికుడిగా,క్లాసీ మూవీస్ తో మాస్ చేత కూడా క్లాప్స్ కొట్టించగల సత్తా ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ కి అజ్ఞాతవాసి మామూలు షాక్ ఇవ్వలేదు.అయితే ఆ సినిమా దెబ్బ నుండి త్వరగానే కోలుకుని,చేతిలో ఉన్న ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో ట్రాక్ మీదకి రావడానికి ఏ మాత్రం లేట్ చెయ్యకుండా ఆ సినిమాని పట్టాలెక్కించాడు.తీసుకున్న పాయింట్ దగ్గరినుండి సినిమా తీసే టైం వరకు అన్ని విషయాల్లో కూడా అందరిని ఆశ్చర్యపరుస్తూ అరవింద సమేత తో మళ్ళీ ప్రేక్షకులముందుకు వచ్చాడు.ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ దాకా, సినిమా నుండి వదిలిన కంటెంట్ త్రివిక్రమ్ స్టైల్ కు పూర్తి విరుద్దంగా కనిపించింది.దీంతో ఈసినిమా ఎలా ఉంటుందా అనే ఉత్కంఠ పదింతలు పెరిగింది.బ్యాక్ టూ బ్యాక్ నాలుగు గ్రాండ్ సక్సెస్ లతో సూపర్ ఫాంలో ఉన్న ఎన్టీఆర్ ఖచ్చితంగా ఏదో బలమైన ఎలిమెంట్ ఉన్న సబ్జెక్ట్ నే ఎంచుకుని ఉంటాడని నమ్మిన అభిమానులు.. ఈ సినిమా కొసం చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. స్టార్ హీరో సినిమా థియోటర్ లోకి వచ్చి నెలలు దాటిపోవడంతో సామాన్య ప్రేక్షకులు కూడా అరవింద సమేత ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తితో ఎదురు చూశారు.. అలా భారీ అంచనాల నడుమ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డ్ లు తిరగరాస్తూ.. థియేటర్లోకి వచ్చిన అరవింద సమేత వీరరాఘవ రెడ్డి ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకున్నాడు.. అభిమానుల ఆకలిని తీర్చాడా లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..

కథ: ముప్పై ఎళ్ళ క్రితం ఐదు రూపాలయ కారణంగా.. రాయలసీమలో ఉన్న రెండు ఊళ్ళ మధ్య ఫ్యాక్షన్ కక్ష్యలు తలెత్తుతాయి.నల్లగుడి కి  చెందిన బసిరెడ్డి, కోమర్తి కి చెందిన నారపురెడ్డి కుటుంబాల మధ్య ఆ వైరం కొనసాగుతుంటుంది.కాల క్రమంలో నారపు రెడ్డి బసిరెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా మారతాడు.అదే టైంలో విదేశాలలో తన చదువు పూర్తిచేసుకుని సొంత ఊరు వచ్చిన నారపురెడ్డికొడుకు వీరరాఘవరెడ్డి కళ్ళముందే తన తండ్రిని చంపేస్తారు. అయితే ఆ హత్య తరువాత తన నానమ్మ చెప్పిన మాటకు కట్టుబడి ఆఫ్యాక్షన్ కక్షను అంతం చేయడానికి ఒక కొత్త దారిని ఎంచుకుండాడు వీరరాఘవ రెడ్డి… ఆ దారి ఎంటి..? ఆ దారిలో నడిచి అతను ఫ్యాక్షన్ కక్షలను అంతం చేసి , ఎలా శాంతి నెలకొల్పాడు.. అనేది సినిమా కథ

విశ్లేషణ:ఎప్పటినుండో విని విని ఉన్న ఫ్యాక్షన్ కథను తన టచ్ తో కొత్తగా చెప్పడానికే ప్రయతనించాడు త్రివిక్రమ్.అందుకోసం అతనికి పదునయినా ఆయుధం లాంటి ఎన్టీఆర్ దొరికాడు.దాంతో ఈ సినిమాకి కావాల్సిన సపోర్ట్ ఆటోమాటిక్ గా వచ్చేసింది.ఈ సినిమా మొదటి 20 నిముషాలు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.రెగ్యులర్ ఫ్యాక్షన్ సినిమాల క్లయిమాక్స్ తరహాలో,బోయపాటికి కూడా సాధ్యం కానీ రేంజ్ ఆ ఎలిమెంట్స్ తీర్చిదిద్దాడు త్రివిక్రమ్.అయితే హీరో రూట్ మార్చుకోవడతో కథ కాస్త గాడి తప్పినట్టు కనిపించినా కూడా ఇంటర్వెల్ మళ్ళీ మూడ్ ని సెట్ చేస్తుంది.సెకండ్ హాఫ్ లో కూడా 10 నిమిషాల గ్యాప్ లో వచ్చే ఎపిసోడ్స్ బావుంటాయి.ప్రీ-క్లయిమాక్స్,క్లైమాక్స్ సినిమాకి హైలైట్స్.త్రివిక్రమ్ కసి,ఎన్టీఆర్  నటన,నందమూరి అభిమానుల సపోర్ట్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చెలరేగుతుంది.

నటీనటులు:ఎలాంటి పాత్రనేైన తన నటనతో పీక్స్ లో నిలబెట్టే.. ఎన్టీఆర్ వీరరాఘవరెడ్డి పాత్రలో మరోసారి తనలోని నటుడిని పరిపూర్ణంగా తెరపై ఆవిష్కరించాడు. కామెడీ సీన్స్ టైమింగ్ లో కాని, ఎమోషనల్ సీన్స్ లో ఇంటెన్సీటీ కాని, యాక్షన్స్ సీన్స్ లో ఈజ్ కాని, డాన్సింగ్ లో గ్రేస్ కాని.. అన్నింటిని కలిపి సింగిల్ ప్యాకేజ్ గా అభిమానులకు.. జోష్ ఫుల్ డోస్ ను పంచాడు.. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో ఎన్టీఆర్ నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది.. ఇక ఒక్క సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన పూజా హెగ్డే ఈ సినిమాలో కూడా ప్లజంట్ లుక్స్ తో ఆకట్టుకుంది.. ఎన్టీఆర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది…కామెడీ సీన్స్ లో పర్వాలేదు అనిపించింది.. అయితే ఆమె పాత్రకు ఆమే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో.. అక్కడక్కడా.. సన్నివేశాలలో ఫీల్ తగ్గింది.. ఇక ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు క్రూరత్వానికి ప్రతిరూపంగా నిలిచి.. సినిమాకు మరొక ఆకర్షణగా మారాడు.. అతని విలనిజం.. క్లైమాక్స్ లో అతని హావభావాలు.. కన్నకొడుకునే చంపిన సీన్స్ లో అతని నటతో ఆశ్చర్యపరిచాడు..ఇక బసిరెడ్డి కొడుకుగా నవీన్ చంద్ర ఉన్నంతలో బాగానే చేశాడు.. ఇకలాయర్ గా నరేష్.. అతని అసిస్టెంట్ గా శ్రీనివాస్ రెడ్డి..నవ్వులు పూయించారు.. ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సునిల్.. కమెడియన్ గా నవ్వించడానికి పరిమితం కాలేదు.. కథలో భాగంగా హీరోతో కలిసి ట్రావెలింగ్ చేశాడు. ఈ సినిమా అతని కెరీర్ కి బాగా ఉపయోగపడుతుంది. తెలుగమ్మాయి ఈషా రెబ్బ.. స్క్రీన్ పై చాలా అందంగా కనిపించింది. ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. ఈశ్వరీ రావు, దేవయాని,సితార, నటన సినిమా ఎమోషనల్ కనెక్ట్ కు బాగా ఉపయోగపడింది.. రావు రమేష్ లిమిటెడ్ రోల్ లోనే తన బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.. శుభలేక సుధాకర్,నాగబాబు, బ్రహ్మాజీ, నాగబాబు, శత్రు తదితరులంతా.. పాత్రల పరిదిమేర మంచి నటన కనబరిచారు..

టెక్నీషియన్స్:అజ్ఞాతవాసి ప్లాప్ తో అందరిని డిస్సపాయింట్ చేసిన త్రివిక్రమ్. తనకు కలిసివచ్చిన ప్లాన్ ఏ గాని అచ్చిరాని ప్లాన్ బి గాని రెండింటిని పక్కన పెట్టేసి ప్లాన్ సీ ని ట్రై చేశాడు.. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ టేకింగ్ చూస్తే.. బోయపాటి కూడా సరిపోడు అనిపించింది. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఈ మధ్య కాలంలో ఇంత ఎగ్రసీవ్ గా చూపించింది త్రివిక్రమ్ మాత్రమే అని చెప్పొచ్చు.. రచయితగా కూడా తన మార్క్ సంభాషణలతో ఆకట్టుకున్నాడు.. కాకపోతే కామెడీ టైమింగ్ మాత్రం త్రివిక్రమ్ స్థాయిలో లేదు అనిపిస్తుంది.. ఎమోషనల్ సీన్స్ ని మాత్రం చాలా బాగా హైలెట్ చేశాడు.. ఆ క్రమంలో ఒకటీ రెండు చోట్ల సన్నివేశాలలో .. చిన్న చిన్న సాగదీత కనిపించింది.. ఇక మ్యూజిక్ డైరక్టర్ గా సినిమా సోల్ ను త్రివిక్రమ్ ఫీల్ ను అర్ధం చేసుకున్న తమన్, సినిమాకు యాప్ట్ అయ్యే సంగీతం అందించాడు. ఆర్ ఆర్ కూడా సరికొత్తగా ఉంది. అయితే చార్డ్ బస్టర్ గా నిలిచిన పెనివిటీ సాంగ్ స్క్రీన్ మీద అనుకున్నంత స్థాయిలో లేదు..ఇక సినిమాటోగ్రఫర్ పిఎస్ వినోద్ ఈ సినిమాకు మూల స్థంభంగా నిలిచాడు..కాంప్రమైజింగ్ సీన్స్ లో ఓపెనింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో, క్లైమాక్స్ లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఇచ్చాడు..సాంగ్స్ చాలా గ్లాండియర్ గా రావడంలో అతని కృషి ఉంది. లీడ్ పెయిర్ అయిన ఎన్టీఆర్, పూజాలను కాస్తంత కేర్ తీసుకుని మరీ స్క్రీన్ మీద అందంగా చూపించాడు. ఎడిటర్ నవీన్ నూలే ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా రేంజ్ కు తగిన విధంగా బాగున్నాయి..

చివరిగా :దసరా పండుగ సీజన్ కు ఎలాంటి సినిమాలు ఆశించి, ప్రేక్షకులు థియోటర్ కు వస్తారో.. వాళ్ళందరిని శాటిస్పై చేసే అంశాలతో, ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడక్కడా కంటెంట్ ప్లో డ్రాప్ అయినా.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కొమ్ముకాచి ఈ సినిమాని పడిపోకుండా నిలబెట్టారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ , మాస్ ఆడియన్స్ ని అనుకున్నంతగా అలరించిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీస్ కు కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. దసరా సెలవలు కూడా రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బాటమ్ లైన్: త్రివిక్రమ్ సమేత ఎన్టీఆర్