సమీక్ష : శైలజా రెడ్డి అల్లుడు

362
sailaja reddy alludu
sailaja reddy alludu

విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2018
CB రేటింగ్ : 3/5

నటీనటులు : నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్య కృష్ణ

దర్శకత్వం : మారుతీ

నిర్మాతలు : సితార ఎంటర్టైన్మెంట్స్

సంగీతం : గోపీ సుందర్

సినిమాటోగ్రఫర్ : నిజార్ షఫీ

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

కామెడీని తనదైన శైలిలో డీల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ల్స్అందుకున్న మారుతి.. నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడు అనగానే.. ఇదొక విచిత్రమైన కాభినేషన్ అని టాలీవుడ్ లో కామెంట్స్ వినిపించాయి.. కాని టీజర్స్ ట్రైలార్స్ విడుదల అవ్వగానే, వాటిల్లో చైతూ లుక్స్.. రమ్యకృష్ణ అప్పీరియస్స్.. అనూ ఇమ్మాన్యూయల్ గ్లామర్ చూసి, ఇదేదో వర్కౌంట్ అయ్యేలా ఉందే అని అంతా అనుకున్నారు.. ఇక ఈ మధ్య టాఫ్ ఫామ్ లో ఉన్న వెన్నెల కిషోర్ పృధ్వీలాంటి కామెడియన్స్ కూడా సినిమాలో ఉండటంతో ఇది పక్కా టైం పాస్ ఎంటర్టైనర్ అని, టాక్ విపరీతంగా స్పెడ్ అయ్యింది. పండక్కి వస్తున్నా..పండగ చేసుకుందా అన్న శైలజా రెడ్డి అల్లుడు.. మరి నిజంగానే ఆ పండగసందడిని అందించాడా.. లేక రొటీన్ గా ఉండి బోర్ కొట్టించాడా అన్నది ఇప్పుడు చూద్దాం..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విపరీతమైన ఇగోఉన్న బిజినెస్ మాన్ రావు కొడుకు చైతూ..తన ఇగో కోసం కూతురు పెళ్ళిని కూడా కాన్సిల్ చేసుకునేంత ఇగో ఉంటుంది రావుకి వాళ్ళుంటున్న కాలనీలోకి కొత్తగా వచ్చిన అనూ అనే అమ్మాయితో.. తొలిచూపులోనే ఇష్టపడతాడు చైతూ.. అనూకి కూడా తన తండ్రి రావు లాగానే భరీంచలేనంత ఇగో ఉందని తెలిసి, పనిమనిషిని ప్రేమిస్తున్నట్లుగా.. నాటకమాడి.. అనూని ప్రేమలోకి దిపుతాడు చైతూ.అనుకి కూడా తనలాగే ఇగో ఎక్కువ అని తెలుసుకున్న రావు.. చైతన్య అనూల పెళ్ళికి ఒప్పుకుంటాడు.. కాని కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫంక్షన్ లో అనూ పర్మిషన్ లేకుండా చైతూ, అనూలా ఎంగేజ్ మెంట్ కూడా చేసేస్తాడు రావు… కాని అదే సమయంలో అనూ వరంగల్ జిల్లాను శాసించే శైలజా రెడ్డి కూతురని తెలుస్తుంది.. తనకు తెలియకుండా ఏది జరగడానికి ఇష్టపడని శైలజా రెడ్డి.. అనూ, చైతన్యల పెళ్ళికి ఒప్పుకుందా.. వాళ్ల ఇగోలను పక్కన పెట్టి.. శైలజా రెడ్డి, రావులు చైతన్య, అనూల పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారా లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే..

నటీనటుల విషయానికి వస్తే… ఇప్పటిదాక రొమాన్స్ ను తన బలంగా మార్చుకుని హిట్స్ కొడుతున్న చైతన్యా.. మారుతీని నమ్మి..ఫస్టైం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ను ఎటమ్ట్ చేశాడు.. లుక్స్ పరంగా చాలా బావున్నాడు. పెళ్ళి అయిన తరువాత ఫేస్ లో గ్లో పెరిగింది. చైతూ ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే. ఈ సినిమాలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.. మారుతి చాలా తెలివిగా చైతన్యా కన్నా కూడా పక్కనున్నవాళ్ళతో ఎక్కువ కామెడీ చేయించాడు.. దాంతో తన పార్ట్ వరకు కంపర్ట్ ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు చైతు.. ఈ సినిమాకు మరో బిగెస్ట్ ఎసెట్ అయిన రమ్యకృష్ణ అప్పీరియన్స్ ఉన్నంత ఇంపాక్ట్ ఫుల్ గా ఆమె క్యార్టరైజేష్ లేకపోవడం.. సినిమాకు మెయిన్ మైనస్ అయితే ఉన్నంతలోనే తన యాక్టింగ్ ఎబిలిటీతో..శైలజా రెడ్డిని సజీవంగా తెరపై నిలిపింది రమ్యకృష్ణ… ఇక అనూ ఇమ్మాన్యూయల్.. ఎప్పటి లాగానే లుక్స్ పరంగా డీసెంట్ గా ఉంది.. అను క్యారక్టర్ లో ఇగోయిస్టిక్ రిచ్ ఉమెన్ గా నటించి మెప్పించింది.. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు సపోర్ట్ కాగా, పృధ్వి కామెడీ మాత్రం బాగానే పేలింది.. మురళీ శర్మ,నరేష్, దాసరి అరుణ్ కుమార్ రఘుబాబు తమ పాత్రల మరిదిమేర బాగానే నటించారు..

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ అయిన మారుతి.. మహానుబావుడు తరహా కామెడీ డిజైన్ చేయడంలో కాస్త తడబడ్డాడు.. శైలజా రెడ్డి క్యారక్టర్ ఎలా ఉంటుందో అని ఊహించుకున్న వాళ్లకు మారుతి రైటింగ్ లోని వీక్ నెస్, నిరాశను మిగిల్చింది.. స్టార్ సినిమాలను హ్యాండిల్ చేయడంలో మారుతి తడబాటు మరోసారి స్పస్టంగా కనిపించింది.. అయితే ఎపిసోడ్స్ వైజ్ కొన్ని సీన్స్ మాత్రం హిల్లేరియస్ గా ఉన్నాయి.. సినిమా అంతా అదే కన్సిస్టెన్సీ మెయిన్ టేన్ చేసుంటే..సినిమా నెక్ట్స్ లెవల్ లో ఉండేది.. ఇక ఈ మధ్య గీతా గోవిందంతో ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరిని తన మ్యూజిక్ తో ప్లాట్ చేసిన.. గోపీ సుందర్ ఈ సినిమాకు వచ్చేసరికి పర్వాలేదు అనిపించాడు.. పాటల పరంగా టూ ట్రాక్స్ తో ఇంప్రస్ చేసిన గోపీ సుందర్ ఆర్ ఆర్ పరంగా సినిమా మూడ్ ని కంటెంట్ కు తగిన విధంగా మంచి అవుట్ పుట్ ఇచ్చాడు.. కెమెరా మెన్ నిజర్ షఫీ.. మారుతీ విజన్ ను బాగా ఓన్ చేసుకుని మంచి కలర్ ఫుల్ విజ్యూవల్స్ ను అందించాడు.. నిర్మాణ విలువలకు తిరుగులేదు.. మిగతా డిపార్డ్ మెంట్స్ అన్నీ డీసెంట్ అవుట్ పుట్ ఇచ్చాయి.. ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే… మొదటి నుండి విడుదలకు ఆటంకాలు ఎదురు అవుతున్న శైలజా రెడ్డి అల్లుడు,పేరుకు తగ్గట్టుగానే కాస్త ఓల్డ్ టచ్ కథా, కథనాలతోనే వచ్చాడు.. కామెడీ కూడా అనుకున్నంత లేకపోవడంతో.. శైలజా రెడ్డి అల్లుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది… పండుగ సీజన్ కాబట్టి, బీ,సి సెంటర్స్ కు కనక్ట్ అయితే కనుక శైలజా రెడ్డి అల్లుడు సేఫ్ అయిపోవడం కాయం.

ప్లస్ పాయింట్స్

చైతు, అనుల నటన

ఫస్ట్ హాఫ్

రమ్యకృష్ణ ఇమేజ్

కొన్ని ఫ్యాన్ మూమెంట్స్

మైనస్ పాయింట్స్

రొటీన్ స్టోరి

పేలని కామెడి

సింగింల్ డైమన్షన్ క్యారక్టర్స్