కేంద్రంతో ఆఖ‌రి పోరాటానికి విప‌క్షాల రాజీనామా అస్త్రం ..?

22
BJP, TDP, Chandrababu Naidu, Rahul Gandhi
BJP, TDP, Chandrababu Naidu, Rahul Gandhi

మ‌రోసారి దేశ రాజ‌ధానిలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇటు స్పీక‌ర్ విందు జ‌రుగుతుండ‌గానే అటు విప‌క్షాలు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు నిరసననే వ్యక్తం చేయడానికి ప్రతిపక్షాలు పావులు కదిపాయి. లోక్‌సభ ఎంపీల మూకుమ్మడి రాజీనామాలపై తర్జనభర్జనలు పడ్డాయి. కేంద్రంతో ఆఖ‌రి పోరాటానికి విప‌క్షాల రాజీనామా అస్త్రం ప్ర‌యోగించేందుకు వ్యూహాత్మ‌కంగా అడ‌గులు వేస్తున్నాయి. అయితే ఈ విష‌యంలో ఇంకా క్లారిటీ మాత్రం రాకుండా పోయింది. మూడు దశాబ్దాల కిందట ఎన్టీ రామారావు నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ఊహించని నిరసనకు దిగింది. ఏకంగా 12 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 106 మంది ఎంపీలు రాజీనామా చేశారు. ఇదే సీన్ ని ఇప్పుడు రిపీట్ చేసేందుకు విప‌క్షాలు స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే ప్రతిపాదనపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపా ఏపి సిఎం చంద్ర‌బాబు .

దేశంలోని ప్రతిపక్ష పార్టీలపై బిజేపి స‌ర్కారు అణచివేత చర్యలకు పాల్పడడానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్‌సభ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు రాఫెల్‌ కుంభకోణంపైజ‌.జేపిసి నియమించడానికి మోదీ ప్ర‌భుత్వం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకుండా దాట వేసింది. వీట‌న్నిటినీ ల‌క్ష్యంగా చేసుకుని లోక్‌సభకు చివరి రోజు అయిన బుధ‌వారం మోదీ సర్కారు తీరుపై ఆఖరి పోరాటంగా ప్రతిపక్షాలన్నీ సంఘటితమయ్యాయనడానికి సంకేతంగా రాజీనామా చేయాలని యోచిస్తున్న‌ట్లు తెలిసింది.