‘ఫస్ట్ డే’ కలెక్షన్స్ తో నిరుత్సాహ పరిచిన మజ్ను !

33
Mr Majnu, Akhil
Mr Majnu, Akhil

తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేసిన మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం మిశ్రమ స్పందన అందుకుంది. తన మొదటి సినిమా కూడా రిలీజ్ ఆవ్వకముందే, అఖిల్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ.. తను చేసిన మొదటి రెండు సినిమాలు మాత్రం అఖిల్ కి ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ ని తెచ్చి పెట్టలేకపోయాయి.

అయితే మిస్టర్ మజ్నుతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా కోసం అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుని మరి చేశాడు. అయిన ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. కాగా మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 4.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి నిరుత్సాహ పరిచింది. ఇక ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 3.24కోట్ల షేర్ ను రాబట్టింది.

ఏపీ మరియు తెలంగాణలో ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు :

గుంటూరు – 0. 54లక్షలు

ఉత్తరాంధ్ర – 0.40లక్షలు

తూర్పు గోదావరి – 0.20లక్షలు

నైజాం – 1.08 కోట్లు

సీడెడ్ – 0.48లక్షలు

కృష్ణా – 0.25 లక్షలు

నెల్లూరు – 0.12లక్షలు

పశ్చిమ గోదావరి – 0.17లక్షలు

మొత్తం – 3. 24 కోట్లు