అఫీషియల్ :బాహుబలి ని దాటేసిన 2.0

412
2 point 0 vs bahubali
2 point 0 vs bahubali

రజినీకాంత్ హీరో గా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 2.0 భారీ అంచనాల నడుమ వచ్చింది.అయితే ఈ సినిమాని 2D అండ్ 3D ఫార్మాట్స్ లో తెరకెక్కించడంతో మొదటి వీకెండ్ వరకు ఈ సినిమా పర్ఫెక్ట్ టాక్ బయటికి రాలేదు.కానీ మొదటివారం వసూళ్లు చూసాక మాత్రం ఈ సినిమా విన్నర్ అనే విషయం క్లియర్ గా కన్వే అయ్యింది.సెకండ్ డే డ్రాప్ అయిన ఆ సినిమా వసూళ్లు వీకెండ్ లో మాత్రం 50 శాతం పెరిగాయి.దాంతో మొదటి నాలుగు రోజులకు గాను ఏకంగా 400 కోట్ల వసూళ్లు సాధించింది 2.0.మొదటివారం మొత్తంకలుపుకుని 500 కోట్ల మైలు రాయి అందుకుంది.

వరల్డ్స్ మెగా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా 500 కోట్ల మైలురాయి అనేక్రమంలో అనేక మైలు రాళ్లు అధిగమించింది.బాహుబలి మొదటి పార్ట్ హిందీ లో ఫుల్ రన్ లో 120 కోట్లవరకు కలెక్ట్ చేసింది.ఆ వసూళ్లను 2.o వారం కూడా తిరక్కుండానే దాటేసింది.కానీ బాహుబలి సెకండ్ పార్ట్ వసూళ్లు మాత్రం 500 కోట్లకు పైమాటే.ఆ వసూళ్లను అందుకోవడం మాత్రం చాలా కష్టం.దాదాపు అసాధ్యం కూడా.హిందీ లో 250 కోట్లవరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.హిందీలో డబ్బింగ్ సినిమాల్లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది 2.0.రజినీకాంత్ కి కెరీర్ లోనే హిందీ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందించిన సినిమా ఇదే.అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ లో ఉన్న అక్షయ్ కుమార్ సినిమా ఏదీ కూడా ఇప్పటివరకు రెండువందల కోట్లు సాధించిన దాఖలాలు లేవు.

కానీ 2.0 ఆ లోటు తీర్చేస్తుంది అనడంలో మాత్రం నో డౌట్.ఇప్పటికే అక్షయ్ కుమార్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది 2.౦.శంకర్ బియాండ్ ఫార్ విజువలైజేషన్ కి అంతా ఫిదా అయిపోతున్నారు.మొక్రోబాట్ చేసే విన్యాసాలు అయితే ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.ఓవర్ ఆల్ గా 2.0 ఫుల్ రన్ లో 1000 కోట్ల వసూళ్ల మార్క్ ని అందుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.