అన‌కాప‌ల్లి ఎంపి అవంతి ఏ గ‌ట్టున వుంటారో..!

21

ఎన్నికలు సమీపిస్తున్నవేళ వలసల పర్వం ఏపి పాలిటిక్స్ లో మ‌రింత హీట్‌ని పెంచుతోంది. అధికార‌, విప‌క్షాల నుంచి జంప్ జిలానీలు అథిక‌మ‌వుతున్నారు . తాజాగా అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మారబోతున్నారంటూ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

గతంలో అసెంబ్లీ సీటు విషయంలోతెలుగుదేశం అధినేత,సీఎం చంద్రబాబు ఇచ్చి హామీ విషయంలో ఎటూ తేల్చకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారని అంటున్నారు. కొన్నేళ్లుగా తాను టీడీపీలో ఉన్నా పార్టీ చేసిందేమీ లేదంటూ అవంతి శ్రీనివాస్ సన్నిహితుల వద్ద మొర‌పెట్టుకున్నార‌ని తెలిసింది. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రెండు మూడు రోజుల్లో అవంతి రూట్ ఎటో క్లారిటీ రానుంది.