రివ్యూ : అనగనగా ఓ ప్రేమకథ’ – పాయింట్ బాగున్నా ఇంట్రస్ట్ గా సాగదు !

127
Anaganaga O Prema Katha
Anaganaga O Prema Katha

నటీనటులు : విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు తదితరులు.
దర్శకత్వం : ప్రతాప్ తాతంశెట్టి.
సంగీతం : కె.సి.అంజన్
సినిమాటోగ్రఫర్ : ఎదురొలు రాజు
స్క్రీన్ ప్లే : ప్రతాప్ తాతంశెట్టి.
ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు

ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకత్వంలో థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌ పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :
సూర్య (విరాజ్‌ జె.అశ్విన్‌) ఆర్క్ టెక్ గా వర్క్ చేస్తుంటాడు. కాకపోతే అమ్మాయిల వెంట పడుతూ లవ్ చేస్తుంటాడు. సూర్య ఎదురింట్లో ఉండే అనన్య (రిద్దికుమార్‌) సూర్యకి చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. ఊహ తెలిసినప్పటి నుంచీ సిన్సియర్ గా సూర్యని లవ్ చేస్తుంటుంది. సూర్య ఎవరితో తిరిగిన చివరకి తన ప్రేమనే వెతుక్కుంటూ వస్తాడని నమ్మకంగా ఉంటుంది. ఈ క్రమంలో సూర్య పూజ( రాధా బంగారు)ని సిన్సియర్ గా ప్రేమిస్తాడు. కాని పూజ సూర్యని మోసం చేసి వేరే వ్యక్తితో వెళ్లి పోతుంది. ఆ బాధలో ఉన్న సూర్య అనన్య తనని ఎంత గొప్పగా ప్రేమిస్తుందో తెలుసుకుంటాడు. దాంతో సూర్య కూడా అనన్యను ప్రేమిస్తాడు. ఇక ఆలస్యం చెయ్యకుండా తాను కూడా ప్రేమిస్తున విషయం సూర్య అనన్యను చెబుతాడు. కానీ అనన్య మాత్రం సూర్య అసలు ఎవరో తనకు తెలియనట్లు బిహేవ్ చేస్తోంది. సూర్యని జీవితంలో మొదటి సారి చూసినట్లు ఫీల్ అవుతుంది. సూర్యను ప్రాణం కన్నా ఎక్కువుగా ప్రేమించిన అనన్య ఎందుకు ఆలా బిహేవ్ చేస్తోంది ? అసలు అనన్యకు ఏమైంది ? సూర్యని వదిలేసి మలేషియా ఎందుకు వెళ్లి పోతుంది ? సూర్య చివరకి అనన్య ప్రేమను సొంతం చేసుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ :
సినిమాలో దర్శకుడు బ్రెయిన్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. కేవలం కొన్ని సన్నివేశాల మీదనే శ్రద్ధ పెట్టిన దర్శకుడు మిగతా సన్నివేశాల మీద అంతే శ్రద్ధ పెట్టడంలో విఫలమయ్యారు. అరకొరగా కొన్ని ప్రేమ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఫస్టాఫ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమి లేదు. సినిమా మొదలయిన ఒక గంట వరకు ప్రేక్షకులకు ఒక క్లారిటీ అంటూ రాదు. ఇంటర్వెల్ తో హైప్ తెచ్చిన దర్శకుడు అదే హైప్ ని నిలబెడుతూ చిత్రాన్ని సెకండాఫ్ లో కొనసాగించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. సెకండాఫ్ కూడా కాస్త సాగదీతగా ఉన్నట్టుంటుంది. అలాగే హీరో హీరోయిన్ల మధ్యన వచ్చే ప్రేమ మరియు సంఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. అయితే సినిమా అక్కడక్కడ సరదాగా సాగిన, ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దర్శకుడు ట్రీట్మెంట్ పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

నటీనటులు :
ఈ సినిమాలో హీరోగా నటించిన విరాజ్‌ జె.అశ్విన్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. అమ్మాయిల వెంట సరదాగా తిరిగే ఓ కుర్రాడి పాత్రలో.. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని సరదా సన్నివేశాల్లో గాని, అలాగే సెకెండ్ హాఫ్ లో హీరోయిన్ కి తన ప్రేమను తెలియజేసే సన్నివేశంలో గాని విరాజ్‌ జె.అశ్విన్ చాలా చక్కగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రిద్దికుమార్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. హీరోయిన్ ఫాదర్ గా నటించిన నటుడు కూడా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అలాగే మరో కీలక పాత్రలో నటించిన రాధా బంగారు కూడా బాగా నటించింది. ఇక కమెడియన్ వేణు, తన కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

టెక్నీషియన్స్:
సినిమాలో మెయిన్ హైలెట్ అంశాలు అంటే ఎదురొలు రాజు అందించిన సినిమాటోగ్రఫీనే అని చెప్పాలి. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు కె.సి.అంజన్ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో మరో హైలెట్ మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను కూడా అయన తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేశారు. దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టిి మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

చివరిగా :
ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకత్వంలో విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోదు. కాకపోతే కథలోని కీలక మైన ఎమోషనల్ కంటెంట్ బాగుంది. కానీ, ఆ కంటెంట్ కి తగట్లు కథ కథనాలను మాత్రం దర్శకుడు ఆకట్టుకున్నే విధంగా రాసుకోలేకపోయాడు. పైగా సినిమా ఆసాంతం ఆసక్తి రేకెత్తించకుండా సాగుతూ.. బోర్ కొట్టిస్తోంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.