సమీక్ష : ‘అంతరిక్షం’

177
Antariksham9000kmph Review
Antariksham9000kmph Review

నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిధి రావ్, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు.

CB.ఇన్ రేటింగ్ : 3.2/5

దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి
సంగీతం : ప్రశాంత్ విహారి
సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వి.యస్
స్క్రీన్ ప్లే : సంకల్ప్ రెడ్డి
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాత: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి.

“ఘాజీ” వంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నటువంటి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఇప్పటి వరకు తెలుగులో రానటువంటి అంతరిక్ష కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం “ ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :కథలోకి వెళ్ళినట్లైతే ఐదు సంవత్సరాల క్రితం వరుణ్ తేజ్(దేవ్) చంద్రుని పై విప్రయాన్ శాటిలైట్ ను పంపే ప్రాసెస్ లో ఉంటాడు. అయితే అప్పటికే పారు (లావణ్య త్రిపాఠి)తో దేవ్ ప్రేమలో ఉంటాడు. తనని తన కన్నా ఎక్కువుగా ప్రేమిస్తాడు. కానీ అనుకోకుండా జరిగే కొన్ని ఇబ్బందికర పరిస్థుతుల వల్ల తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి)ని కోల్పోవడంతో పాటు, తన విప్రయాన్ మిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఓ మిషన్ ను పూర్తి చెయ్యడానికి వరుణ్ దేవ్ (వరుణ్ తేజ్) అవసరం ఏర్పడుతుంది. ఆ మిషన్ ను పూర్తి చేసే క్రమంలో దేవ్ కి కొన్ని సమస్యలను ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొని దేవ్ వాటిని ఎలా పరిష్కరించాడు ? అలాగే తన విప్రయాన్ మిషన్ ని ఎలా పూర్తి చేశాడు ? రెండు మెషన్ లను దేవ్ తన బృందంతో ఎలా విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాడా ? లేదా ? అన్నది వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :సినిమా ప్రారంభమే అంతరిక్షంలోని సన్నివేశాలతో మొదలవుతుంది. మొదట్లో కథ కాస్త మెల్లగానే సాగినా వరుణ్ తేజ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి గతానికి మరియు ప్రస్తుతాని సంబంధించి వచ్చిన సీన్లు కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. ఇక హీరోయిన్ అదితి రావ్ వ్యోమగామిగా తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక సెకండాఫ్ కూడా ప్రారంభమే కాస్త ఆసక్తిగా ఫస్టాఫ్ లో చూపిన విధంగా అంతరిక్షంలో మొదలవుతుంది. అంతరిక్షయానం చేసినటువంటి వరుణ్ టీమ్ లో వారిలో వారికే కొన్ని ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం వలన కథ ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది. సెకండాఫ్ లో వచ్చే విజువల్స్ పరంగా చెప్పాలి అంటే దర్శకుని యొక్క కమిట్మెంట్ ని మెచ్చుకొనే తీరాలి. సినిమా చూస్తున్నంతసేపు ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ కాస్త బాగుంది అనే విధంగా ప్రేక్షుకులు ఫీల్ అవుతారు. కొన్ని ఛాలెంజింగ్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఇంకా కుతూహలాన్ని పెంచుతాయి

అయితే ‘అంతరిక్షం’ నేపథ్యంలో కథను బాగానే తయారుచేసుకున్న దర్శకుడు కథనాన్నిమాత్రం పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో కొన్నిటిని మాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయారు. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, హీరో అండ్ టీమ్ ఎలాంటి కష్టాల్లో పడతారో, వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా సినిమాని నడపలేదు. ఇక సినిమా ఫస్టాఫ్ కథనం కూడ సాదా సీదాగానే గడిచిపోయింది. హీరో మిషన్ లోకి రావడం వరకు బాగానే ఉన్నా ప్రీ ఇంటర్వెల్ ముందుకి వరకు కథనం నెమ్మదిగానే సాగుతుంది. పైగా స్పేస్ సినిమాల్లో ఉండాల్సిన సీరియస్ నెస్ కూడా ఈ చిత్రంలో కొంత కరువైందనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

నటీనటులు :దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పెస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కూడా తన నటన బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి కూడా తన నటనతో ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన అతిథిరావ్ కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.
అలాగే లావణ్య త్రిపాఠి తండ్రిగా నటించిన రెహమాన్ తో పాటు , అవసరాల శ్రీనివాస్, సత్యదేవ్ తదితరులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

టెక్నీషియన్స్ : సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి సంగీతం బాగుంది. జ్ఞాన శేఖర్ వి.యస్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలను అభినందించాలి. వాళ్ళ నిర్మాణ విలువులు కూడా చాలా బాగున్నాయి. మంచి కథా నేపధ్యాన్నితీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ స్పేస్ నేపథ్యంలో ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతవరకు ఏ తెలుగు దర్శకుడు టచ్ చేయని స్పేస్ జానర్ ను తీసుకునందుకు ఆయన్ని మెచ్చుకొని తీరాల్సిందే.

చివరగా : “ఘాజీ” వంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నటువంటి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం “ఘాజీ” ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది. ఇప్పటి వరకు తెలుగులో రానటువంటి అంతరిక్ష కథ నేపథ్యంలో రావడంతో సినిమా కొత్త అన్నిభూతినిస్తోంది. కానీ దర్శకుడు “ఘాజీ”లా ఈ సినిమాని కూడా తానూ అనుకున్న రీతిలో తెరకెక్కించడంలో మాత్రం ఈ సారి విఫలమయ్యాడు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో వేచి చూడాలి.