సమీక్ష : బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌ బ్లఫ్ మాస్టర్…హిట్ మీటర్

152
Bluff Master Movie Review
Bluff Master Movie Review

విడుదల తేదీ : డిసెంబర్ 28, 2018
Chitrambhalare Rating : 3.2/5
నటీనటులు : సత్యదేవ్, నందిత శ్వేత్ తదితరులు.
దర్శకత్వం : గోపీ గణేష్ పట్టాభి
నిర్మాత : రమేష్, పి.పిళ్ళై
సంగీతం : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫర్ : దాశరధి శివేంద్ర
ఎడిటర్ : నవీన్ నూలి

జ్యోతి లక్ష్మి సినిమాథి నటుడిగా పరిచయమై సినిమా సినిమాకి నటుడిగా ఇంప్రూవ్ అవుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ తెచ్చుకున్న సత్యదేవ్ ఇప్పడు హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.తమిళంలో హిట్ అయిన శతురంగ వేట్టై సినిమాని తెలుగులో బ్లఫ్ మాస్టర్ పేరుతో రీమేక్ చేసారు.ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్స్ లో ఉన్న ప్రామిసింగ్ కంటెంట్ వల్ల ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.మరి ఈ సినిమా ఆ బజ్ ని నిలబెట్టుకుని హిట్ బాట పట్టిందా లేదా?…2018 కి సక్సెస్ ఫుల్ ఎండింగ్ ఇచ్చిందా? లేదా అనేది ఇప్పడు చూద్దాం.

కథ:

డబ్బు ఉంటే చాలు అన్ని సొంతం అవుతాయి అని నమ్మే ఉత్తమ్ కుమార్ అనేక వేషాలు వేస్తూ,మోసాలు చేస్తూ అత్యాశ చూపిస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు.అయితే ఒకసారి మాత్రం అనుకోకుండా పోలీసులకు చిక్కుతాడు.అయితే అతను డబ్బు అందరిని మానేజ్ చేసి బయటకు వచ్చిన కూడా అతని చేతిలో మోసపోయిన ఒక వ్యక్త్తి రౌడీలతో కిడ్నాప్ చేయించి డబ్బు డిమాండ్ చేస్తాడు.అదే టైం లో ఉత్తమ్ కుమార్ తో కలిసి మోసాలు చేసే అతని అసిస్టెంట్స్ అతన్నే మోసం చేసి వెళ్లిపోవడంతో అతను తన పాతజీవితాన్ని వదిలేసి,అవని ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తాడు.కానీ అతని ఇంతకుముందు చేసిన మోసాల వల్ల ఇబ్బందులపాలు అవుతాడు.విలన్స్ చేతిలో చిక్కుకున్న అతను బయటపడడానికి ఎలాంటి ప్లాన్స్ వేసాడు?,వాటి వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?…చివరికి అతని జీవితం ఏమయ్యింది వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

నాలుగు సంవత్సరాలక్రితం తమిళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాకోసం కొన్ని మార్పులు చేర్పులు చేసి,తెలుగు నేటివిటీ కి తగట్టుగా మార్చారు.మామూలుగా రీమేక్ సినిమాకి ఈ విషయంలోనే కష్టాలు ఎదురవుతాయి.ఫలితాలు తారుమారవుతాయి.కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలాంటి ప్రొబ్లెమ్స్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.దాంతో సినిమా టెక్ ఆఫ్ చాలా స్మూత్ గా జరిగింది.కామెడీ కోసం అక్కడక్కడా కాస్త లైన్ నుండి అవే గా వెళ్లినా కనెక్టవిటీ మిస్ కాకపోవడం ఈ సినిమాని కాపాడింది.అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్న టీమ్ హెరాయిన్ డబ్బింగ్ విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించారు.ఈ సినిమా కంటెంట్ లోనే హ్యూమర్ ఉంది.దాన్ని గోపీగణేష్ తన మాటలతో కాస్త ఎలోబారెట్ చేసాడు.అయితే సినిమా ఫస్ట్ హాఫ్ పరిగెత్తినంతగా సెకండ్ హాఫ్ స్కోర్ చెయ్యలేకపోయింది.సెకండ్ హాఫ్ కాస్త తగ్గింది.ఎమోషన్స్ లో డెప్త్ తగ్గింది.అవి అనుకున్నంతగా కనెక్ట్ కాలేదు.కొన్ని సీన్స్ రిపీట్ గా అనిపించడం,మరికొన్ని సీన్స్ మరీ ఓవర్ ది బోర్డు అనిపించినట్టుగా ఉన్నాయి.అవి మినహాయిస్తే బ్లఫ్ మాస్టర్ విషయంలో పెద్దగా చెప్పుకునే నెగెటివ్స్ ఏమీ లేవు.

నటీనటులు:

ఈ సినిమాలో హీరో గా చాలా ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకున్న సత్యదేవ్ ఆ పాత్రకోసం చాలా డేడికేటెడ్ వర్క్ చేసాడు.టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో పాటు ఆ క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ అన్నిటిని కూడా పెర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేసాడు.కొన్ని చోట్ల లౌడర్ గా ఉన్న సీన్స్ మాత్రం కాస్త ఇబ్బంది పెడతాయి.ఫైన్ పెర్ఫార్మర్ గా పేరుతెచ్చుకున్న నందిత శ్వేతా ఈ సినిమాలో మాత్రం కాస్త డిస్ కంఫర్ట్ గా కనిపించింది.దానికి తోడు ఆమె డబ్బింగ్ చాలా దారుణంగా ఉంది.విలన్ గా ఆదిత్య మీనన్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.బ్రహ్మాజీ,చైతన్య కృష్ణ,తదితరులు ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్:

మొదటి సినిమాతోనే చాలా వరకు ఆకట్టుకున్న డైరెక్టర్ గోపీగణేష్ పట్టాభి ఈ సినిమాకోసం చేసిన హార్డ్ వర్క్ స్క్రీన్ పై రిఫ్లెక్ట్ అయ్యింది.కత్తిమీద సాము లాంటి ఈ సినిమా సోల్ ని పట్టుకుని,దానికి అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ,దాన్ని సపోర్ట్ చేసే డైలాగ్స్ రాసుకుంటూ సినిమాని అందరికి చేరువ అయ్యేలా రూపొందించాడు.అలాగే సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో పెద్ద ఎస్సెట్.అలాగే దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది.ఎడిటర్ నవీన్ నూలి అనుభవం ఈ సినిమాకి ఉపయోగపడింది.నిర్మాతలు కథను నమ్మి బాగానే ఖర్చు చేసారు.

చివరిగా:

ఇయర్ ఎండింగ్ లో కాన్ఫిడెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన బ్లఫ్ మాస్టర్ క్లాస్ మాస్ అనేది తేడా లేకుండా అందరిని ఆకట్టుకునే ఇంప్రెసివ్ కంటెంట్ తో వచ్చిన బ్లఫ్ మాస్టర్ సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బోటమ్ లైన్ :బ్లఫ్ మాస్టర్…హిట్ మీటర్