చిరు-కొరటాల మూవీ ఉందా? లేదా?

207
chiranjeevi and Koritala Shiva
chiranjeevi and Koritala Shiva

రీ ఎంట్రీ లో కూడా తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు,ఫ్యాన్ బేస్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు అని నిరూపించుకున్న మెగాస్టార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా కోసం ఒక రేంజ్ లో హార్డ్ వర్క్ చేస్తున్నాడు.లెక్కకు మించిన షెడ్యూల్స్ ఉన్నా కూడా ఏ మాత్రం అలసిపోకుండా కష్టపడుతున్నాడు.రామ్ చరణ్ ఈ సినిమాని వందల కోట్ల బడ్జెట్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నాడు.నేషనల్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా 2019 సమ్మర్ రిలీజ్ అనుకుంటే ఆ డేట్ కూడా దాటిపోయి 2020 సంక్రాంతికి ఫిక్స్ అయింది.

సైరా లేట్ అవుతుండడంతో ఆ ఎఫెక్ట్ ఆల్రెడీ చిరు కోసం స్క్రిప్ట్  లాక్ చేసుకుని రెడీ గా ఉన్న కొరటాల పై పడుతుంది.ఇప్పటివరకు చేసిన నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిపిన ఈ రైటింగ్ మాస్టర్ కి ఆల్రెడీ స్టార్ హీరో నుండి కాల్స్ వస్తున్నాయి.కానీ చిరు తో సినిమా అని కూర్చున్నాడు.నిజానికి ఇప్పటికే కొరటాల-చిరు సినిమా స్టార్ట్ అయిపోయి ఉండాలి.కానీ అలా జరగలేదు.దాంతో కొరటాల మహర్షి తరువాత మళ్ళీ మహేష్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు అనే మాట వినిపించింది.సుకుమార్ సినిమా ఆలస్యం అవుతుండడం,సందీప్ రెడ్డి వంగా కూడా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ తో బిజీ గా ఉండి సగం స్క్రిప్ట్ మాత్రమే నెర్రెట్ చెయ్యడంతో మహేష్ కి కొరటాల మాత్రమే సరయిన ఆప్షన్ గా కనిపించాడు.

అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయాలపై పూర్తి క్లారిటీ వచ్చింది.కొరటాల లేట్ అయినా కూడా చిరుతో సినిమా చేసుకుని బయటికి వెళతాడు.ఆ తరువాత కొరటాల కి ఎటూ ఎన్టీఆర్ సినిమా ఉండనే ఉంది.మహేష్ కూడా ఎనీ టైం రెడీ.కాబట్టి ఇప్పటికే పూర్తిచేసిన స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుకుంటున్నాడు అని టాక్ వినిపిస్తుంది.చిరు ఫ్రీ అయ్యేటప్పటికి  2019 ఫస్ట్ దాటిపోతుంది.అందుకే ఇప్పుడే ఎప్పటికప్పడు స్క్రిప్ట్ ని చిరు తో డిస్కస్ చేసి ఫైనల్ చేసుకుంటున్నాడు.ఒక్కసారి స్టార్ట్ అయితే ఆరునెల్లలో సినిమా బయటకి వస్తుంది.కానీ ఈ గ్యాప్ లో మహేష్ కి మాత్రమే వేరే ఆప్షన్ ని వెదుక్కోవాల్సిన అవసరం వచ్చింది.ఇప్పటికయితే చిరు 152 వ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.