ఏపి సిఎం హ‌త్యాయ‌త్న కేసులో నిందితుడు లొంగుబాటు ..?

50
ChandrababuNaidu
ChandrababuNaidu

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఒగ్గు సుధాకర్ అలియాస్ కిరణ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆయన మీద కోటి రూపాయల రివార్డు ఉంది. ఏపి సిఎం చంద్రబాబు మీద అలిపిరిలో జరిగిన హత్యా యత్నంలో ఇత‌డు ప్రధాన నిందితుడు. మావో యిస్టు దళ కమాండర్‌ ఒగ్గు సుధా కర్‌ అలియాస్‌ సట్వాజీ అలియాస్‌ బురియార్‌ , అలియాస్‌ కిరణ్‌ జార్ఖండ్‌ పోలీసులకు భార్య మాధవితో సహా లొంగిపోయారు.

తెలంగాణలోని నిర్మల్ జిల్లా సారంగాపూర్‌కు చెందిన సుధాకర్ జార్ఖండ్ మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు. సుధాకర్ 2013 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ భార్య మాధవితో కలిసి రాంచి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతోపాటు జార్ఖండ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సుధాకర్‌ పలు విధ్వంసాలు సృష్టించడంతో ప్రభుత్వం ఆయనపై కోటి రూపాయల నజరానా ప్రకటించారు . మూడున్నర దశాబ్దాల పాటు మావోయిస్టు నేతగా చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.ఒగ్గు సుధాకర్.