అన్నపూర్ణలో సందడి చేయనున్న ‘దేవ్’ !

57
Dev, Karthi, Rakul Preet
Dev, Karthi, Rakul Preet

తమిళ్ స్టార్ కార్తీ హీరోగా, తమిళ్ దర్శకుడు రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన రాబోతున్న చిత్రం ‘దేవ్‌’. తాజాగా ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ఈ నెల 10వ తేదీన సాయత్రం 6 గంటలకు గ్రాండ్ గా జరగనుంది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ట్రైలర్ లో కార్తి క్యారెక్టర్ తో పాటు, రకుల్ ప్రీత్ సింగ్, రమ్యకృష్ణ క్యారెక్టర్స్ కూడా ఇంట్రస్టింగ్ గా అనిపించాయి. అలాగే ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ కూడా సినిమాలో మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని చెబుతుంది. ఈ చిత్రంలో కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తున్నారు.

అలాగే కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ సినిమాకి హరీష్‌ జయరాజ్‌ సంగీతమందించారు. సుమారు 50కోట్ల బడ్జెట్ తో ప్రిన్స్ పిక్చర్స్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు విడుదలచేస్తున్నారు.