తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ‘ఎఫ్ 2’ !

69
F2 Movie, Venkatesh, Varuntej
F2 Movie, Venkatesh, Varuntej

ఈ సంక్రాంతికి పోటీగా వచ్చిన మూడు తెలుగు చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టడంలో ‘ఎఫ్2’ ముందు వరుసలో నిలుస్తూ దూసుకుపోతుంది. మొదటి షో నుంచే మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ని దిల్ రాజు నిర్మించారు.

కాగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక కలక్షన్ల విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వారం రోజుల్లో 43 కోట్లషేర్ ను రాబట్టగా.. తెలుగు రాష్ట్రాల్లో 35.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి.. బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏరియాల వారిగా క్రింది విధంగా ఉన్నాయి.

గుంటూరు – 3.14 కోట్లు

ఉత్తరాంధ్ర – 4.71 కోట్లు

తూర్పు గోదావరి – 4.24కోట్లు

పశ్చిమ గోదావరి – 2.36 కోట్లు

కృష్ణా – 3.12 కోట్లు

నైజాం – 11.80 కోట్లు

సీడెడ్ – 4.57కోట్లు

నెల్లూరు – 1.11కోట్లు

మొత్తం – 35.05 కోట్లు