జ‌న‌సేనలో ఆశావాహుల వ‌డ‌పోత‌

75
Pawan Kalyan, Janasena party
Pawan Kalyan, Janasena party

సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరులో జ‌న‌సేన పార్టీ స‌త్తా చాటేందుకు ఉర‌క‌లు వేస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో కమిటీలను నియమిస్తూ క్యాడర్ ని అలెర్ట్ చేసింది. పార్టీ అధినేత‌ పవన్ తొలి అభ్యర్థిగా స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుండే అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ‌ను చేప‌ట్టారు. విజ‌య‌వాడలోని జనసేన ప్రధాన కార్యాల‌యంలో మాదాసు గంగాధరం ఆధ్వర్యంలో ఐదుగురు స‌భ్యుల స్క్రీనింగ్ క‌మిటీ బయోడేటాల పరిశీలన ప్రారంభించింది.

ఎనిమిది జిల్లాల నుండి ఆశావహులు జనసేన కార్యాలయానికి వచ్చి త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించ‌డ‌మే గాక త‌మ ప్రాధాన్య‌త‌ను సైతం స్క్రీనింగ్ క‌మిటీ ముందుంచారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ ఉంటుందన్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గంగాధరం వామపక్షాలతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయన్నారు. మార్చిలో పవన్ తొలి జాబితా ప్రకటిస్తారని ఆయ‌న వెల్ల‌డించారు.మ‌రోవైపు పోటీచేసే ఆశావాహులు స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తులు పంపిస్తున్నారు.