గ‌వ‌ర్న‌ర్‌ని జ‌గ‌న్ ఎందుకు క‌లిసారంటే ..!

21
Jagan Mohan Reddy Governor Narasimhan
Jagan Mohan Reddy Governor Narasimhan

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు, జాబితాలో అవకతవకలు జరిగాయని గవర్నర్ న‌ర‌సింహ‌న్ కు ఏపి ప్ర‌తిప‌క్ష నేత జగన్ ఫిర్యాదు చేశారు. ప‌లువురు వైసిపి నేత‌ల‌తో క‌ల‌సి రాజ్ భ‌వ‌న్ కు వెళ్లిన ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో భేటీ ఆయ్యారు. అనంత‌రం ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని దొంగ ఓట్ల వ్యవహారాన్ని సుదీర్ఘంగా వివరించామన్నారు. ఇదే విష‌యాన్ని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు గ‌వ‌ర్న‌ర్ కు చెప్పామ‌న్నారు. దాదాపుగా 59 లక్షల బోగస్‌ ఓట్లు ఎలా ఉన్నాయో.. వాటిని తొలగించాల్సిన అవసరం ఎంతగా ఉందో వివ‌రించ‌డం జ‌రిగింద‌న్నారు జ‌గ‌న్ . అధికారాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల సర్వేల పేరుతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్న విషయాన్ని గవర్నర్‌కు ఆధారాలతో సహా తెలియజేశామ‌ని వెల్ల‌డించారు.

    దాని ఆధారంగా టీడీపీకి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఓట్లను దగ్గరుండి తొలగించే కార్యక్రమం ఎలా చేస్తున్నారో కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌ర‌గింద‌న్నారు. పోలీసు శాఖను ఎలా రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారో కూడా వివరించామ‌న్నారు జ‌గ‌న్ .