సమీక్ష : ఇదం జగత్ –  థ్రిల్ చేయలేకపోయిన క్రైమ్ థ్రిల్లర్ !

189
Idam Jagath, Sumanth
Idam Jagath, Sumanth

విడుదల తేదీ : డిసెంబర్ 28, 2018
chitrambhalare రేటింగ్ : 2.75/5
నటీనటులు : సుమంత్ , అంజు కురియన్ , శివాజీ రాజా
దర్శకత్వం : అనిల్ శ్రీకంఠం
నిర్మాత : శ్రీధర్ గంగపట్నం
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్ : బాల్ రెడ్డి
ఎడిటర్ : గ్యారి బిహెచ్

నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో సుమంత్ , అంజు కురియన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇదం జగత్’. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును  ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :  

ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నిషిత్ (సుమంత్ ) నైట్ రిపోర్టర్ గా వర్క్ చేస్తుంటాడు. రాత్రిళ్లు జరిగే సంఘటలను షూట్ చేసి ఆ ఫుటేజ్ ను  ఛానెల్ కు అమ్ముకుని డబ్బు సంపాదిస్తాడు.  ఈ క్రమంలో కొన్ని సంఘటనల అనంతరం హీరోయిన్ మహతి (అంజు కురియన్) వాళ్ల ఫాదర్ హత్యాకు గురవుతాడు. ఈ హత్యా ను కూడా సుమంత్ రికార్డుచేస్తాడు. దాంతో దాన్ని భారీ మొత్తంలో  క్యాష్ చేసుకోవాలనుకుంటాడు.  మరి సుమంత్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా ? లేదా ? అసలు ఆ హత్యాను కారకులు ఎవరు ? చివరకి ఆ హత్య సుమంత్ కి ఎలా కనెక్ట్ అవుతుంది ? లాంటి విషయాలు తెలియాలంటే  ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ :

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే.. దర్శకుడు అనిల్ శ్రీకంఠం మంచి పాయింట్ ను తీసుకున్నప్పటికీ.. ఆ ఇంట్రస్టింగ్ సబ్జెక్టు ను తెర మీదకు తీసుకురావడంలో మాత్రం చాలా చోట్ల తడబడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్ అంటేనే ఆసక్తికర మలుపులు , ఉత్కంఠతో కూడిన స్క్రీన్ ప్లే ఎక్స్ పెక్ట్ చేస్తారు, కాని ఈ చిత్రంలో అవి మిస్ అయ్యాయి. ఓవరాల్ గా దర్శకుడు ఒక డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో మంచి స్టోరీ లైన్ ను తీసుకున్న.. దాన్ని తెర మీదకు తీసుకరావడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. ఇక  హీరో , హీరోయిన్ల మధ్య  వచ్చే లవ్ ట్రాక్ అలాగే  క్లైమాక్స్ సన్నివేశాలు  సినిమాటిక్ గా అనిపిస్తాయి.  వీటితో పాటు లో బడ్జెట్ కూడా ఈచిత్రం యొక్క ఫలితాన్ని దెబ్బతీసింది. క్వాలిటీ లేని విజువల్స్ సినిమా ఫై ఆసక్తిని తీసుకురాలేకపోయింది.
ఫస్ట్ హాఫ్  స్లో సాగుతూ ప్రేక్షకుడిని నీరసం తెప్పిస్తుంది.  ఇంట్రస్టింగ్ పాయింట్ ఉన్న  కథకు సరైన కథనం తోడైయితే సినిమా ఫలితం ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ చిత్రం కథనం విషయం లో నిరాశపరచడంతో ఆ ప్రభావం సినిమా ఫలితం  ఫై పడింది.

నటీనటులు :

నైట్ రిపోక్టర్ పాత్రలో నటించిన  సుమంత్  ఆ పాత్రకు పూర్తిగా  న్యాయం చేశాడు.  సవాలు తో కూడుకున్న పాత్ర కాకపోవడంతో పెద్దగా కష్టపడ్డట్లు అనిపించదు. హీరోయిన్ అంజు కురియన్ తన పాత్ర పరిధి మేర నటించింది. కాకపోతే గ్లామర్ పరంగా అంతగా మెప్పించలేకపోయింది.  ఇక  హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన  సత్య అలాగే పోలీస్ ఆఫీసర్ గా నటించిన శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు.   ఇక కమెడియన్ గా నటించిన కొత్త నటుడు కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేయగా.. మిగిలిన నటీనటులు కూడా  తమ పాత్ర పరిధి మేరకు  బాగా నటించారు.

టెక్నీషియన్స్:

దర్శకుడు అనిల్ శ్రీకంఠం ఆసక్తికరమైన థ్రిల్లర్ ను ప్రేక్షకులను అందించాలనుకొని ఆ ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు.  స్లో నరేషన్ ఊహించిన ట్విస్టులు సినిమాను  ప్రభావితం చేశాయి.  ఇక శ్రీ చరణ్ పాకాల సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది.  ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు.  ఇక సినిమాలో బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ  బాగుంది. దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు.  ఎడిటింగ్ సినిమాకి తగ్గట్లే ఉంది.  సినిమాలోని నిర్మాత  పాటించిన  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివరిగా:

నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో సుమంత్ , అంజు కురియన్ జంటగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అనుకున్నంతగా థ్రిల్ చేయలేకపోయింది.  సుమంత్ నటన , కథ ఈ సినిమాకు హైలైట్ అవ్వగా కథనం ,స్లో నరేషన్ , ఊహించిన ట్విస్ట్ లు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి.  చివరగా ఈ చిత్రం క్రైం జోనర్ ను ఇష్టపడే వారికీ నచ్చుతుంది కానీ మిగితా వర్గాల ప్రేక్షకులకు ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.