సైరాలో వీరారెడ్డిగా జగపతిబాబు

31
Jagapathi Babu
Jagapathi Babu

హీరోగా కుటుంబ కథా చిత్రాలు చేస్తూ మ్యాన్లీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు జగపతిబాబు.కానీ విలన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా కూడా అన్ని రకాల పాత్రలు వేస్తూ,మెప్పిస్తూ వెర్సటైల్ యాక్టర్ అనిపించుకున్నాడు కూడా.ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలకమయిన పాత్ర చేస్తున్నాడు.సైరా లో నటిస్తున్న ప్రతి ఆర్టిస్ట్ పుట్టిన రోజుకి వాళ్ళ తాలూకు ఫస్ట్ లుక్ అండ్ క్యారెక్టర్ నేమ్ రివీల్ చేస్తూ సినిమా పై క్యూరియాసిటీ బిల్డ్ అప్ చేస్తున్నడు ఆ సినిమా టీమ్ జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన క్యారెక్టర్ పోస్టర్ ,నేమ్ రివీల్ చేసారు.

చూడడానికి రాజు గెటప్ లో ఉన్నా కూడా ఈ సినిమాలో జపతిబాబు పేరు వీరారెడ్డి.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనుచరుల్లో ఒక ముఖ్యమయిన అనుచరుడు అని టాక్.కానీ ఈ గెటప్ అందుకు భిన్నంగా ఉంది.ఈ గెటప్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాలి.కానీ జగపతి బాబు డైనమిక్ లుక్ మాత్రం మెస్మరిసింగ్ గా ఉంది.సైలెంట్ గా చూస్తున్నా కూడా కళ్ళల్లో ఇంటెన్సిటీ మాత్రం వైబ్రoట్ గా ఉంది.ఇక జగ్గు దాదా యాక్టింగ్ అండ్ వాయిస్ కూడా జతకలిస్తే సైరా కూడా జగపతిబాబు అల్ టైం బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ లో ఒకటిగా నిలిచిపోతుంది.అలా నిలిచిపోవాలి అని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు జగతి బాబు అలియాస్ వీరారెడ్డి.

Jagapathi Babu
Jagapathi Babu