ఓట‌ర్ల హృద‌యానికి చేరువ‌లో జ‌న‌సైన్యం

66
Pawan Kalyan, Janasena party, chandrababu naidu
Pawan Kalyan, Janasena party, chandrababu naidu

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు న‌గ‌రా మోగ‌క‌ముందే జ‌న‌సేన శంఖారావం మోగించింది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ స‌మ‌ర భేరికి సిద్ద‌మైంది. అలుపెర‌గ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నిక‌ల క‌ధ‌న‌రంగానికి ఇప్ప‌టికే స్కెచ్ వేశారు. వార్ వ‌న్ సైడ్ కాకుండా త్రిముఖ పోరుకు జ‌న‌సైన్యంతో ముంద‌డుగు వేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌జా పోరాట యాత్ర‌ల‌తో స‌త్తా చాటిన ప‌వ‌న్ త‌మ ఇజంని , విజ‌న్ ని ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేశారు. అటు అధికార టిడిపి, ఇటు విప‌క్ష వైసిపి తీరును ఎండ‌గ‌డుతూ ప్ర‌జాక్షేత్రంలో త‌మ దారేదో క్లారిటీ ఇచ్చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. వామ‌ప‌క్షాల‌కు స్నేహ హ‌స్తం అందించి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ గ‌ళాన్ని విప్పుతూ స్వ‌రాన్ని పెంచుతూ వ‌స్తున్నారు ప‌వ‌న్‌. అధికార‌మే ప‌ర‌మావాధి కాదంటూ సామాన్యుల స‌మ‌స్య‌లు, వాటికి శాశ్వ‌త ప‌రిష్కారాలే అజెండాగా ప్ర‌జాక్షేత్రంలో త‌మ స్థానాన్ని సుస్థిర ప‌ర‌చుకునేందుకు నిత్య‌కృషీవ‌లుడు నిచ్చెన వేశారు.

స‌మాజంలోని మేధావులు, వివిధ రంగాల‌లోని నిష్ణాతుల‌తో జ‌న‌సేన‌కు అండ‌దండ‌లుగా క‌మిటీలు వేసి జ‌న‌సేన పార్టీ బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్ ముందుకు దూసుకుపోతున్నారు. వీరంద‌రి ద్వారా సామాన్య ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన విశ్వాసాన్ని పెంపొందించుకోవ‌డంతో పాటు వారి స‌మ‌స్య‌ల ప‌ట్ల ఎప్ప‌టిక‌ప్పుడు స్పందించ‌డ‌మేగాక తాము అండ‌గా నిల‌బ‌డ‌తామ‌నే భ‌రోసాను ఇప్ప‌టికే ఇవ్వ‌క‌లిగింది జ‌న‌సేన పార్టీ. ప్రాంతీయ పార్టీల‌లో వుండే అధినాయ‌కుని పూజ‌ల వంటి వాటికి తిలోద‌కాలు ఇస్తూ , రాజ‌కీయాల‌లో కొత్త‌ర‌కం సాంప్ర‌దాయాల‌కు శ్రీకారం చుట్టారు ప‌వ‌న్‌. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా పార్టీని విజ‌య‌ప‌ధంలో న‌డిపేందుకు త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు ఆయ‌న‌.

యువతకు పాతిక కేజీల బియ్యంతో సరిపెట్టకుండా.. పాతికేళ్ల బంగారు భవిష్యత్తును అందించాలన్నదే తన లక్ష్యమని ఇప్ప‌టికే ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో కమిటీలను నియమిస్తూ క్యాడర్ ని అలెర్ట్ చేసిన పవన్, తొలి అభ్యర్థిగా స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు కూడా చేసుకుని పాలిటిక్స్ లో స‌రికొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టారు. జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కు సలహాదారుగా పనిచేసిన వ్యక్తి , తమిళనాడుకు చెందిన వి.పొన్‌రాజ్ నియమించారు. దీన్ని బ‌ట్టే అర్ధ‌మ‌వుతోంది ఆయ‌న‌ విజ‌న్ ఏమిటో..! అభిమానాన్ని నాణేనికి ఒక‌వైపుగా చూసిన తెలుగు ప్ర‌జ‌లు , ఇప్పుడు రెండు వైపు చూస్తూ రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఆయ‌న‌ని విజేత‌గా నిలిపేందుకు రెఢీ అవుతున్నారు.