మ‌రింత‌ దూకుడుగా జ‌న‌సేన పార్టీ

61
Pawan Kalayn, Janasena.
Pawan Kalayn, Janasena.

ఎన్నికలకు సమయం దగ్గర ప‌డుతోన్న కొద్దీ జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే ప‌లు కమిటీలను వేసిన అధ్యక్షుడు పవన్ తాజాగా పార్టీ సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ సలహా మండలి చైర్మన్‌గా విష్ణురాజును, సభ్యులుగా పొన్ను రాజ్, సుధాకర్‌ను నియమించారు. యువతకు పాతిక కేజీల బియ్యంతో సరిపెట్టకుండా.. పాతికేళ్ల బంగారు భవిష్యత్తును అందించాలన్నదే తన లక్ష్యమన్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.

ఇటువంటి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా మంది మేధావుల సలహాలు ఆవశ్యకమన్నారు ఆయ‌న‌.అందుకే సలహా మండలిని ఏర్పాటు చేశామన్నారు. దీనిలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు పవన్. ఇటు అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ‌ను చేప‌ట్టారు. 2019 సార్వత్రిక ఎన్నిక‌ల కోసం జ‌న‌సేన పార్టీ త‌రఫున బ‌రిలో నిలవాలనే ఆశావ‌హుల బ‌యోడేటాలను పరిశీలిస్తున్నారు. విజ‌య‌వాడలోని జనసేన ప్రధాన కార్యాల‌యంలో ఐదుగురు స‌భ్యుల స్క్రీనింగ్ క‌మిటీ బయో డేటాల పరిశీలన ప్రారంభించింది.మాదాసు గంగాధరం ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలనచేప‌ట్టారు.