సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న రాకింగ్ ట్రైలర్

129
K G F
K G F

KGF ….ఇప్పడు ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్.మొదటి ట్రైలర్ తోనే అందరిలో ఒక క్యూరియాసిటీ కలిగించిన ఈ సినిమా ఇప్పడు రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ తో మాత్రం టాక్ ఆఫ్ కంట్రీ అయిపొయింది.ఆ ట్రైలర్ లో ఉన్న రగ్గుడ్ అండ్ రా అప్పీల్ చాలా కొత్త ఫీల్ కలిగిస్తుంది.ఇక కన్నడ స్టార్ హీరో యష్ లుక్స్ అయితే సూపర్ అనిపించేలా ఉన్నాయి.

అతని యాటిట్యూడ్,బోడి లాంగ్వేజ్ అండ్ ఇంటెన్సిటిఫీడ్ లుక్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.ముందు ఆ సినిమాని కన్నడ లో మాత్రమే రిలీజ్ చెయ్యాలి అనుకున్నా కూడా ఇప్పడు మాత్రం టోటల్ ఇండియా వైడ్ అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు.ఆ స్టన్నింగ్ విజువల్స్ అండ్ పీరియాడిక్ ఫ్లేవర్ సినిమాకి చాలా పెద్ద ప్లస్.అలానే యాక్షన్ ఎపిసోడ్స్ ని బర్త్ టేకింగ్ గా షూట్ చేసారు.ఆ సినిమా సెట్టింగ్స్ చూస్తుంటే నిజంగా KGF లో షూట్ చేసినట్టే ఉన్నాయి.అన్ని రకాలుగా ఖచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా అని ఫీల్ తీసుకువచ్చిన KGF ఈ నెల 21 న భారీగా రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వస్తుండడంతో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.ఈ రీసెంట్ ట్రైలర్ తో ఆ రోజు రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్న తెలుగు సినిమాలు మరో సారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.