లక్ష్మీస్ ఎన్టీఆర్: చాలా ఘాటుగా

41
RGV, Lakshmis NTR
RGV, Lakshmis NTR

ఈ మధ్య RGV ఏ సినిమా చేసినా హిట్ అవ్వట్లేదుగాని ఖచ్చితంగా కాట్రవర్సీ అయితే క్రియేట్ అవుతుంది.ఇప్పడు వర్మ లేటెస్ట్ గా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా అంతే.కాకపోతే ఇక్కడ ఎంచుకునే పాయింటే వివాదాస్పదం కావడంతో ఆ ట్రైలర్ సంచలనం రేపుతోంది.ఇప్పటివరకు వెండితెరపై ఎన్టీఆర్ వైభవం,గొప్పతనం మాత్రమే చూసినవాళ్లకు మొట్టమొదటిసారి ఆయన దగా పడి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలను చూపించి అటెన్షన్ క్రియేట్ చేసుకున్నాడు RGV.

అసలు ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎలా ప్రవేశించింది అనే విషయంతో మొదలుపెట్టి ఎన్టీఆర్ రాజకీయ పతనం,అనంతరం అయన పడిన మానసిక క్షోభ,లక్ష్మి పార్వతిని పెళ్లాడడం..అనంతరం కుటుంబానికి,అధికారానికి దూరం కావడం వంటి అంశాలను వర్మ చాలా సూటిగా చెప్పాడు.చంద్రబాబు నాయుడు ని పూర్తిగా నెగెటివ్ గా ప్రెసెంట్ చేస్తున్నాడు.ఆర్టిస్టులంతా పెద్దగా పేరున్న వాళ్ళు కాకపోయినా నిజజీవితంలో దగ్గర పోలికలు ఉన్నవాళ్ళని తీసుకున్నాడు.మాట తీరు కూడా అలానే ఉండడంతో చాల రియలిస్టిక్ ఫీల్ వస్తుంది.ఇక బాబు రాజకీయ ప్రత్యర్థులుకూడా దీన్ని బాగా ప్రోమోట్ చేసి పండగ చేసుకుంటున్నారు.చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ జీవితంలో మొట్టమొదటిసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు అనే అంశం చాలా సెన్సేషనల్ గా మారింది.ట్రైలర్ తోనే చిన్న సైజు తుఫాన్ క్రియేట్ చేసిన వర్మ సినిమాతో ఇంకెలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.