యంగ్ డెరెక్టర్ తో మహేష్ 26 వ సినిమా?

64
Mahesh BaBU
Mahesh BaBU

బ్రహ్మోత్సవం సినిమా తరువాత మహేష్ బాబు లో చాలా మార్పు వచ్చింది.డైరెక్టర్ ఎవరయినా,ప్రొడక్షన్ హౌస్ ఏదైనా కూడా పూర్తిగా స్క్రిప్ట్ అయ్యే వరకు సెట్స్ మీదకి వెళ్లడానికి నో అంటున్నాడు.ఎంత లేట్ అయినా కూడా వెయిట్ చేస్తున్నాడు తప్ప తొందరపడట్లేదు.అందుకే ఇప్పడు స్టార్ట్ అవ్వాల్సిన సుకుమార్ సినిమా కూడా వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది.సుకుమార్ చెప్పిన లైన్ కి ఓకే చెప్పాడు.కానీ పూర్తి స్క్రిప్ట్ లేదు.బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తి అవ్వాలంటే ఇంకా చాలా టైం పడుతుంది.ఆరునెలలు అని సుకుమార్ కమిట్ అయ్యాడు అంటే ఆ నెంబర్ అలా అలా పెరుగుతూ 9 నుండి 10 నెలల వరకు టైం పడుతుంది.సందీప్ రెడ్డి కూడా లైన్ వరకే ఓకే చేయించుకున్నాడు.

దీంతో రీసెంట్ బ్లాక్ బస్టర్ F2 తో కలిపి వరుసగా నాలుగు హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి తో నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.లైన్ కి ఓకే చెప్పాడు.ప్రొడ్యూసర్ గా మహేష్ ఆప్తుడు అయిన అనిల్ సుంకర రెడీ.అందుకే అనిల్ కూడా మహేష్ సినిమా స్క్రిప్ట్ పై సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు అని టాక్.అంటా అనుకున్నట్టుగా జరిగితే జూన్ నాటికి మహేష్-అనిల్ ల కాంబో లో సినిమా సెట్ మీదకి వెళ్లిపోతుంది.సుక్కు చెక్కుడు అప్పటికయినా పూర్తయితే మైత్రి మూవీ మేకర్స్ లో మహేష్ సినిమా స్టార్ట్ అవుతుంది.సుకుమార్ ఈ మధ్య టెక్నీషియన్ గా రిలాక్స్ అయ్యి ప్రొడ్యూసర్ గా బిజీ అవ్వడంతో ఈ సిట్యుయేషన్ వచ్చింది.