నాగకన్య ట్రైలర్: ఫుల్ ఇంపాక్ట్

41
Jai, Raai Laxmi, Catherine Tresa
Jai, Raai Laxmi, Catherine Tresa

సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ అండ్ గ్రాఫికల్ మిక్స్ తో ఉండే సినిమాలు ఎప్పుడూకూడా కిక్ అందిస్తాయి.ఇప్పడు తమిళ్ లో తెరకెక్కి తెలుగులోకి డబ్ అవుతున్న నాగకన్య కూడా ఆ కోవకి సంబందించిన సినిమానే.నాగకన్య బ్యాక్ డ్రాప్ లో పాగా తీర్చుకోవడం అనే సినిమాలు చాలా వచ్చాయి.కానీ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్స్ అయిన వరు,కేథరిన్ అండ్ లక్ష్మీరాయ్ ముగ్గురూ కూడా నాగకన్యలుగా కనిపిస్తుండడం విశేషం.

వాళ్ళ మధ్య ఉన్న ఒక ఎమోషనల్ పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ ఎల్.సురేష్.జై హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి చాలా ఇంపార్టెన్సీ ఉంది.కొన్ని పెద్ద పెద్ద సినిమాలను చూపించి ఈ సినిమాలో గ్రాఫిక్స్ ని చాలా చులకన చేస్తున్నారు చాలామంది.కానీ పెట్టిన బడ్జెట్ కి తగ్గట్టుగా విజువల్స్ ఉన్నాయి.ట్రైలర్ చూపించినట్టుగా కథనం కాస్త గ్రిప్పింగ్ గా ఉండి,ఎమోషన్స్ కూడా పండితే మాత్రం నవ్విన ఈ నాగకన్య సినిమానే హిట్ అవుతుంది.సినిమాలో కూడా కాస్టింగ్ డీసెంట్ గా ఉంది కాబట్టి ఈ సినిమాని తక్కువ అంచనావెయ్యడానికి లేదు.ట్రైలర్ వరకు క్వాలిటీ పరంగా ఓకే అనిపిస్తూ కంటెంట్ పరంగా ఇంప్రెసివ్ గా ఉన్న నాగకన్య ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

For Trailer Click