సమీక్ష : నెక్స్ట్ ఏంటి?

162
Tamannaah & Sundeep Kishan starrer titled Next Enti!
Tamannaah & Sundeep Kishan starrer titled Next Enti!

విడుదల తేదీ : డిసెంబర్ 07, 2018 

CB రేటింగ్ : 2.75/5

నటీనటులు : సందీప్ కిషన్, తమన్నా, నవదీప్, పూనమ్ కౌర్ తదితరులు.

దర్శకత్వం : కునాల్ కోహ్లీ

నిర్మాత : గౌరీ కృష్ణ

సంగీతం : లియాన్ జోన్స్

సినిమాటోగ్రఫర్ : మనీష్ చంద్ర భట్

ఎడిటర్ : అనిల్ కుమార్ బొంతు

హిందీ లో ఫనా,హమ్ తుమ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ కునాల్ కోహ్లీ తెలుగులో సినిమా తీస్తున్నాడు అనగానే అంతా ఆశ్చర్యపోయారు.హిందీ లో మార్కెట్ ఉండి కేవలం తెలుగులో సినిమా చెయ్యడం,పైగా సందీప్ కిషన్,నవదీప్ లాంటి వాళ్ళను స్టార్ కాస్ట్ గా ఎంచుకోవడంతో ఈ సినిమా ఎలా ఉంటుంది?,ట్రైలర్ లో ఉన్న బోల్డ్ కంటెంట్ కి కునాల్ ఎలాంటి జస్టిఫికేషన్ ఇస్తాడు అనే ఆలోచనతో మల్టిప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్ కి వచ్చారు.మరి ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్ ని సాటిస్ఫాయి చేసిందా?, లేదా?…అసలు ఎలాంటి రిజల్ట్ అందుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:లండన్ లోజస్ట్ ఫన్ అండ్ గో యాటిట్యూడ్ లో ఉండే సంజూ,సింగిల్ పేరెంటింగ్ లో పెరిగి నిజమయిన ప్రేమను కోరుకునే టామీ కలిసి ప్రేమలో పడతారు.ఇద్దరూ ఒకరికిఒకరు బాగా నచ్చడంతో ఒకే ఇంట్లో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు.కానీ వారిమధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ మాత్రం ఉండదు.అయితే అదే విషయంలో జరిగిన గొడవతో ఇద్దరూ విడిపోతారు.ఆ తరువాత టామీ కి క్రిష్ కలుస్తాడు.అతన్ని కూడా ఇష్టపడిన ఆమె అతన్నిపెళ్లిచేసుకోవడానికి మాత్రం నిరాకరిస్తుంది.అలానే అరేంజ్డ్ మేరేజ్ కి ఒప్పుకున్న సంజూ కూడా ఆ అమ్మాయి బిహేవియర్ చూసి బ్రేక్ అప్ చెబుతాడు.లైఫ్ లో అలా కాస్త డిస్ట్రబెన్స్ మోడ్ లో ఉన్న ఆ ఇద్దరు మళ్ళీ ఎదురుపడతారు.ఆ తరువాత వాళ్ళ మధ్య ఏం జరిగింది?,చివరికి మళ్ళీ వాళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:హిందీ లో పెద్ద సినిమాలను సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేసిన కునాల్ కోహ్లీ ఈ సినిమాకి మాత్రం ఎంచుకున్న పాయింట్ లిమిటెడ్ అప్పీల్ గా ఉన్నది కావడం విశేషం.ఆ పాయింట్ నిఅతను చాలా డీప్ గా స్టడీ చేసి సీన్స్ అల్లుకున్నాడు.సినిమాటిక్ వే కి దూరంగా చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించాలి అనుకుని అదే చేసాడు.అదే ఈ సినిమాకి శాపంగా మారింది.వాళ్ళ మధ్య ఉన్న సంఘర్షణ ఎలివేట్ అయ్యేలా అల్లుకున్న సన్నివేశాలు కనిపించలేదు.ఎక్కువగా మాటలతోనే కన్వే చెయ్యాలని చూడడంతో సినిమాలో ఎక్కువశాతం డిస్ కనెక్టింగ్ గానే సాగిపోయింది.సంజూ,టామీ ల బ్రేకప్ తరువాత మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళతో జర్నీ చెయ్యడం వాటి వెనుక ఉద్దేశం ఏంటి? అనేది అస్సలు కన్వీసింగ్ గా లేదు.ఈ సినిమాని ఫారెన్ లో షూట్ చెయ్యడం మాత్రమే సినిమాలో ఆకట్టుకునే అంశం.సంఘర్షణ లేని ప్రేమకథ,భావోద్వేగాలు లేని సన్నివేశాలు,ఇప్పటి జెనరేషన్ కి కూడా అందని అడ్వాన్స్డ్ కల్చర్ అంతా కూడా ఈ సినిమాకి ప్రతికూల అంశాలు.

నటీనటులు:ఈసినిమాకి రిలీజ్ కి ముందు ఉన్న హైప్ అంతా కూడా కేవలం తమన్నా ఒలికించిన గ్లామర్ వల్లే అనేది ఒప్పుకుని తీరాలి.ఈ సినిమా ఆసాంతం పొట్టిబట్టలు వేసి ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేసింది మిల్కీ బ్యూటీ.ఆమె గ్లామర్ తో పాటు నటన కూడా పాస్ మార్క్స్ వేయించుకుంది.ఇక సందీప్ కిషన్ మాత్రం సంజూ పాత్రలో ఫ్లర్టింగ్ గై గా కనిపించాడు.కాకపోతే తమన్నా తో అతని జోడీమాత్రం ఆడ్ గా అనిపించింది.వాళ్ళిద్దరిమధ్య కెమిస్ట్రీ ఏ మాత్రం ఆకట్టుకునేలా సాగలేదు.నవదీప్ అండ్ లారిస్సాలకు నటించడానికి పెద్దగా స్కోప్ లేని పాత్రలు మాత్రమే దక్కాయి.శరత్ బాబు పాత్ర కూడా ఆశించిన ప్రయోజనాన్ని అందించలేదు.పూనమ్ కౌర్  మాత్రం అక్కడక్కడా ఓవర్ యాక్షన్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.

టెక్నీషియన్స్:ఈసినిమాకి కర్త,కర్మ,క్రియ అయిన కునాల్ కోహ్లీ అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు.అతను రాసుకున్న కథ లో సోల్ లేదు,డైలాగ్స్ అర్ధం కాలేదు,సీన్స్ లో క్లారిటీ లేదు.ఓవర్ ఆల్ గా సినిమాకి ఒక గోల్ అనేది లేదు.ఈ సినిమాకి ఏదైనా ఆకర్షణ ఉంది అంటే ఆకట్టుకునే లొకేషన్స్ మాత్రమే.లియోన్ జోన్స్ సంగీతం పరవాలేదు.మిగతా టెక్నీషియన్స్ అంతా కూడా డైరెక్టర్ ఆదేశాలకు లోబడి అతను అనుకున్న అవుట్ ఫుట్ తేవడాయికి ట్రయ్ చేసారు.

చివరిగా:క్లాస్ మూవీ అయినా,మాస్ మూవీ అయినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా లేకపోతే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఈ సినిమా.ఈ సినిమా ఏ వర్గం వారికి కూడా చేరువయ్యే అవకాశాలు కనిపించడంలేదు.

పంచ్ లైన్:నెక్స్ట్ ఏంటి? లో ఏమీ లేదు