ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ

22
Revanth Reddy Telangana Congress Candidate
Revanth Reddy Telangana Congress Candidate

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. నరేందర్ రెడ్డి, ఇద్దరు కుమారులకు ఈడీ ఎనిమిది గంటలపాటు విచారించింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ‌శేఖర్ ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డిని అధికారులు ప్రశ్నించిన‌ట్లు స‌మాచారం. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు మిగిలిన రూ.4.5 కోట్లకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు.

బ్యాంకు స్టేట్ మెంట్స్, ఏసీబీ ఇచ్చిన ఆధారాలను వారి ముందు ఉంచినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం మాట్లాడిన నరేందర్ రెడ్డి ఈ కేసును నాలుగేళ్ళ పాటు ఎందుకు విచారణ చేయలేదని.. ఇప్పుడు మళ్ళీ విచారణ అని త‌న‌తో పాటు ఇద్దరు కుమారులకు కూడా ఇబ్బంది పెడుతున్నారన్నారు . రాజకీయాలలో ఉన్నందున ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. మూడేళ్లు కేసు కదలిక లేకుండా ఇప్పుడు మళ్ళీ ఎందుకు ముందుకు తెచ్చారన్నదే బాధాకర‌మ‌న్నారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్రానికి అప్పగించినట్లుగా కనిపిస్తుందన్నారు వేం నరేందర్ రెడ్డి.