మహానాయకుడి కష్టాల చిట్టా

92
NTR Mahanayakudu, Balakrishna, Krish
kathanayakudu-bala krishna

తెలుగు వాళ్ళు దేవుడిలా ఆరాధించిన ఎన్టీఆర్ బయోపిక్ ని ఆయన నటవారసుడు అయిన బాలయ్య తెరకెక్కించడం,స్వయంగా నిర్మించడం,క్రిష్ దర్శకత్వం వహిస్తుండడంతో అందరిలో చాలా ఆసక్తి క్రియేట్ అయ్యింది.పైగా సంక్రాంతి టైం లో వచ్చిన బాలయ్య సినిమాలు రికార్డ్స్ కూడా సాధించిన సెంటిమెంట్ కూడా ఉండడంతో చెప్పిన రేట్లకే NTR కథానాయకుడు సినిమాని కొనుక్కున్నారు అంతా.

టాక్ కూడా పోసిటివ్ గానే తెచ్చుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పూర్తిగా చతికిల పడింది.NTR కథానాయకుడు ఫలితం డిస్ట్రిబ్యూటర్స్ కి తీవ్ర నష్టాలు మిగిల్చి ఆ టీమ్ కి సైతం ఊహించని షాక్ ఇచ్చింది.దీంతో ఆ సినిమా సెకండ్ పార్ట్ కి రిపేర్లు మొదలుపెట్టారు.కొన్ని ఎమోషనల్ సీన్స్ షూట్ చేసి యాడ్ చేసారు.ఎన్టీఆర్ యంగ్ ఏజ్ పాత్రను కూడా వేరే ఆర్టిస్ట్ తో వేయించారు.ఇలా అనేక మార్పులు,చేర్పులు చేసారు.అసలు ఈ సినిమా ఎప్పుడొస్తుందా?…ఎప్పుడొస్తుందా అనుకుంటే చడీ చప్పుడు లేకుండా పది రోజుల్లో రిలీజ్ అని సింపుల్ గా అనౌన్స్ చేసారు.

అసలే ఈ సినిమాకి బజ్ లేదు.ఇప్పడు ఏవైనా ఈవెంట్స్ చేసి క్రేజ్ పెంచుదాం అనుకుంటే అంత టైం లేదు.ట్రైలర్ అయినా కట్ చేస్తారా? లేదా అని అనుమానంగా ఉంది.కథానాయకుడు సినిమాకి ఒక రేంజ్ లో ప్రోమోట్ చేస్తేనే వసూళ్లు అంతతమాత్రంగా వచ్చాయి.ఇక ఇప్పడు ఆ స్కోప్ అస్సలు లేదు.నీట్ గా,టైట్ గా సినిమాని తీర్చిదిద్దే మార్జిన్ కూడా పెట్టుకోలేదు.కేవలం ఎలెక్షన్ కోడ్ అమలయ్యే లోపు సినిమాని రిలీజ్ చెయ్యాలి అనే హడావిడితో ఈ డేట్ వేశారు.అయితే ఫ్రీ గా ఇస్తున్న ఈ సినిమాని కూడా వెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు.అసలు మహానాయకుడు ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అన్న క్లారిటీ కూడా లేకుండా సినిమా రిలీజ్ ఇచ్చారు అంటే పరిస్థితి అర్ధం అవుతుంది.చరిత్ర సృష్టించాల్సిన సినిమా రూపకల్పనలో చేతులు పెట్టి కెలికినందుకు నిర్మాతగా భారీ మూల్యం చెల్లించుకున్నాడు బాలయ్య.ఈ సినిమా ఎఫెక్ట్ ఇక్కడితో అయిపోదు.NBK ఫిలిమ్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై కూడా పడుతుంది.