పాపం చివరికీ ఎన్టీఆర్ ఇలా ఉపయోగపడ్డాడు !

76
ntr-mahanayakudu
ntr-mahanayakudu

మొత్తానికి ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో చిత్రబృందం ‘మహానాయకుడు’ ఫై ప్రత్యేకమైన కేర్ తీసుకున్నారు. ఈ సారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ‘మహానాయకుడు’ టీం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే మహానాయకుడు’కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్, ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటిస్తున్నాడట. ‘కథానాయకుడు’లో బాలయ్య చిన్న కూతురి కుమారుడిని తన పాత్రలో నటింప జేశాడు. ఇప్పుడు ‘మహానాయకుడు’లో ఎన్టీఆర్ పాత్రలో తన పెద్ద కూతురి కుమారుడ్ని నటింపజేస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ ని ఎంతవరకూ గుర్తు చేస్తోందో, టీడీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గాని, బాలయ్య మనవళ్ళ సినీ ఎంట్రీకి మాత్రం బాగానే ఉపయోగబడుతుంది. పాపం చివరికీ ఎన్టీఆర్ ఇలా ఉపయోగపడ్డాడు.

ఇక ‘కథానాయకుడు’ కొని నష్ట పోయిన డిస్ట్రీబ్యూటర్లకే బయ్యర్స్ కే ‘మహానాయకుడు’ని అమ్మి వాళ్ళకు వచ్చిన నష్టాలన్ని లాభాలుగా మార్చాలని ఎన్టీఆర్ మేకర్స్ భావిస్తోన్నారు. మరి ఆ భావన భావనగానే మిగిలిపోతుందో లేదా నిజం అవుతుందో తెలియాలంటే మహానాయకుడు విడుదల అయ్యేదాకా ఎదురుచూడాల్సిందే.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.