సమీక్ష : పడి పడి లేచె మనసు

113
Padi Padi Leche Manasu Movie Review in Telugu
Padi Padi Leche Manasu Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 21, 2018
CB రేటింగ్ : 3/5
నటీనటులు : శర్వానంద్ , సాయి పల్లవి , మురళీ శర్మ , సునీల్
దర్శకత్వం : హను రాఘవపూడి
నిర్మాత : చెరుకూరి సుధాకర్
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫర్ : జయకృష్ణ
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

శర్వానంద్, సాయి పల్లవి లాంటి ఆర్టిస్టులకి హను రాఘవపూడి లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ జతకలవడం,సినిమా పేరు పడి పడి లేచే మనసు అని పెట్టడంతో సూపర్ ఫీల్ ఉన్న లవ్ ఫీస్ట్ మూవీ డెలివర్ చేస్తారు అని అంతా ఆశించారు.ఇక ఆ సినిమా సాంగ్స్ కూడా మెలోడియస్ గా ఉంటూ ఆకట్టుకోవడంతో పడి పడి లేచె మనసు పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి ఈ సినిమా ఆ అంచనాలు అందుకుండా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ‌ :  కొల్‌కతాలో వైశాలి (సాయి పల్లవి) అనే మెడికల్ స్టూడెంట్ తో ప్రేమలో పడ్డ సూర్య(శర్వానంద్), ఆమెని ఇంప్రెస్ చెయ్యడానికి చాలా ట్రైల్స్ వేస్తాడు,వెంటపడతాడు.దాంతో ఒక టైం లో  వైశాలి కూడా సూర్యని ఇష్టపడుతుంది. కానీ తన గతం కారణంగా కలిసుందాం గాని పెళ్లి వద్దు అంటాడు సూర్య. దీంతో ఇద్దరు విడిపోతారు.మళ్ళీ వీళ్లిద్దరు ఎలా కలిశారు?, ఈ ప్రయాణం లో వాళ్లకు ఎదురైన ఇబ్బందులు ఏంటీ?, అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు : శర్వానంద్‌ మరోసారి తనదైన మోచ‍్యూర్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్‌, లవ్ సీన్స్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి కూడా తన మీద ఉన్న అంచనాలకు తగ్గ స్థాయిలో పర్ఫామ్‌ చేసింది. వైశాలి పాత్రలో జీవించింది. శర్వా, సాయి పల్లవిల నటన సినిమా స్థాయిని పెంచింది. ఇద్దరు నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. సినిమా అంతా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరగటంతో ఇతర పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఉన్నంతలో ప్రియదర్శి, సునీల్‌, వెన్నెల కిశోర్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. మురళి శర్మ, ప్రియా రామన్‌ తమ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్: హను రాఘవపూడి మరోసారి తన మార్క్‌ పొయటిక్‌ ప్రేమకథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథా కథనాలు కాస్త నెమ్మదిగా సాగిన విజువల్స్‌, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్‌ ఇలా అన్ని తొలి భాగాన్ని ఇంట్రస్టింగ్‌గా మార్చేశాయి. కానీ ఇంటర్వెల్‌ సీన్‌ విషయంలో కాస్త తడబడ్డట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల విడిపోవడానికి కారణం కన్వీన్సింగ్ గా అనిపించదు. తొలి భాగాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించి ద్వితీయార్థంలో మాత్రం దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. సినిమా రొటీన్ సీన్స్ తో సాగటంతో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. అక్కడక్కడా సునీల్‌ కామెడీ వర్క్‌ అవుట్‌ అయినా ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. క్లైమాక్స్‌ సన్నివేశాలు కూడా హడావిడిగా ముగించేసినట్టుగా అనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్‌ తన సంగీతంతో మ్యాజిక్‌ చేశాడనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫి, ఆర్ట్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్‌ మణిరత్నం సినిమాలను గుర్తు చేస్తాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చివరిగా:ఇంతకుముందు లవ్ స్టోరీ తీసి పరాజయంతో తన కథ తెరిచిన హనురాఘవపుడి మరోసారి అదే దారిలో వెళ్ళాడు.కానీ ఈ సారి బేసిక్ ప్లాట్ లోనే ప్రోబ్లం ఉంది.దాంతో ఇంటర్వెల్ వరకు పాడుతా లేస్తూ సాగిన సినిమా గ్రాఫ్ ఇంటర్వెల్ తరువాత మాత్రం పూర్తిగా ఫాల్ డౌన్ అయిపొయింది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుంది అనేది వేచి చూడాలి.

బోటమ్  లైన్:పడి పడి లేవలేకపోయిన మనసు