ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప‌వ‌న్ అప్లికేష‌న్

48
Pawan Kalyan, Janasena party
Pawan Kalyan, Janasena party

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జనసేన పార్టీకి ఈ మధ్యనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా తొలి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ కమిటీకి టికెట్ కోసం దరఖాస్తు చేశారు.విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం పవన్‌ అధ్యక్షతన జరిగింది. పవన్‌ నుంచి తొలి దరఖాస్తును కమిటీ స్వీకరించింది.

టికెట్ల కేటాయింపులో స్క్రీనింగ్ కమిటీదే తుది నిర్ణయమని, అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ ఏదైనా కమిటీ ద్వారానా నిర్ణయాలు ఉంటాయని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వెల్లడించారు. డబ్బుకు ప్రాధాన్యతనివ్వకుండా, నిబద్ధత ఉన్న అభ్యర్థులనే జనసేన పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేస్తామ‌ని వివ‌రించారు ఆయ‌న‌. మ‌రోవైపు తెలంగాణలోని ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లకు కమిటీలను పవన్‌ ప్రకటించారు.