వర్రీ అవుతున్న ప్రియా వారియర్

60
Lovers day, priya prakash varrier,
Lovers day, priya prakash varrier,

కేవలం 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియో తో ప్రపంచం మొత్తాన్ని మాయ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ మొదటి సినిమా ఒరు ఆదార్ లవ్ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది.కానీ ఆ సినిమాకి ఫుల్ నెగెటివ్ ఫీడ్ బ్యాక్ మూటగట్టుకుంది.సినిమా ఎలా ఉన్నా కనీసం ప్రియా వారియర్ అయినా ఆకట్టుకుంటుంది అని అనుకున్నారు అంతా.కానీ సినిమాలో ఆమెది లిమిటెడ్ పాత్ర.అంతే కాదు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్,యాక్టింగ్ కూడా అంతంత మాత్రం గా ఉంది.సో,ఆ సినిమా చూసి,సినిమాలో ఆమె నటన చూసి ఫ్యాన్స్ ఫీల్ అయితే,ఆ సినిమా ఇక్కడ రిలీజ్ అయినందుకు ఇప్పడు ప్రియా వారి అవుతుందట.

ఆమెకి నాని సినిమాలో ఛాన్స్ అన్నారు.ఇప్పడు ఆ ఛాన్స్ ఉంటుందా లేదా అనేది డౌట్.అంతే కాదు ఇంతకుముందు చాలా మంది ఆమెని కాంటాక్ట్ అయ్యి అడిగినంత ఇచ్చి ఆమెని హీరోయిన్ గా తెచ్చుకోవడానికి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు.ఇప్పడు వాళ్లంతా కూడా ఆలోచనలో పడ్డారు.అలా అని ఆమెకి వచ్చిన పేరు,తెచ్చుకున్న క్రేజ్ ని ఒకే సినిమా దూరం చేసెయ్యలేదు.కాకపోతే ఇంతకుముందులా అన్ని డిమాండ్స్ పెట్టి,స్టార్ హీరో పక్కన మాత్రమే హీరోయిన్ ఛాన్స్ అంటే మాత్రం అది కుదిరే పని కాదు.మరి ఈ వింక్ బ్యూటీ మ్యాజిక్ కేవలం ఆ వీడియో కే పరిమితం అయిపోతుందా లేదా ముందు ముందు సినిమాల్లో కూడా కంటిన్యూ అవుతుందా అనే విషయం తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వెయిట్ చెయ్యాల్సిందే.