రివ్యూ- ఎఫ్ 2 – సింపుల్ అండ్ ఫన్నీ !

136
venkatesh

విడుదల తేదీ : జనవరి 12, 2019
చిత్రంభలరే .ఇన్ రేటింగ్ : 3.3/5
నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్ తదితరులు

దర్శకత్వం : అనిల్‌ రావిపూడి

నిర్మాత : దిల్ రాజు

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

ఎడిటర్ : తమ్మిరాజు
రొటీన్ కథలతో,,హ్యాట్రిక్ విజయాలు అందుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నాలుగో సినిమాగా ..అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ కంటెంట్ తో F2 సినిమాను స్టార్ట్ చేశాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఫిక్స్ అవ్వడంతోనే ఈ సినిమాకి బజ్ క్రియేట్ అయిపోయింది. ఈ సినిమా టీజర్ జస్ట్ ఓకే అనిపించినా, ట్రైలర్ తో ఎంటర్ టైన్ మెంట్ కి ఢోకా ఉండదు.. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తామంటూ స్ట్రాంగ్ హింట్స్ ఇచ్చింది చిత్ర యూనిట్. సంక్రాంతి రేసులో చివరి సినిమాగా ప్రేక్షకుల ముందకు వచ్చిన F2 ఆడియన్స్ కి ఫన్ పంచిందా..? ఫ్రస్టేట్ చేసిందా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:హారిక అండ్ హనీ.. హై యాటిట్యూడ్ ఫ్యామిలీకి చెందిన అక్కా చెల్లెళ్లు. హారిక ఎమ్మెల్యే దగ్గర పి.ఎ గా ఉన్న వెంకీ ని పెళ్లి చేసుకుంటుంది. హనీకి తన బాయ్ ఫ్రెండ్ అయిన వరుణ్ తో నిశ్చితార్దం అవుతుంది. హారిక ను పెళ్లి చేసుకున్న దగ్గరనుంచి ఆమె టిపికల్ క్యారెక్టర్ తో ఫ్రస్టేట్ అవుతున్న వెంకీ..పెళ్లాడబోతున్న వరుణ్ ని కూడా ఇన్ ఫ్లూయెన్స్ చేస్తాడు. భార్యతో వేగలేక వెంకీ..పెళ్లికి ముందే హనీ వల్ల టార్చర్ మొదలైన వరుణ్ , ఎదురింట్లో ఉంటున్న ప్రసాధ్ మాటలు విని ఎవరికీ చెప్పకుండా యూరప్ వెళ్లిపోతారు.వాళ్లను వెతుక్కుంటూ వెళ్లిన హారిక అండ్ హనీ లను తమ కాళ్ల దగ్గరే పడుండాలని కండీషన్ పెడతారు.దాంతో హార్ట్ అయిన హారిక అండ్ హనీ వెంకీ అండ్ వరుణ్ లకు దారికి తెచ్చుకోవడానికి ఎలాంటి ప్లాన్ వేశారు..? దాంతో వెంకీ అండ్ వరుణ్ ఫ్రస్టేట్ అవుతూ.. వారికి ఎలాంటి కౌంటర్ ఇచ్చారు..? వెంకీ హారిక, వరుణ్ హనీ..ఎలా తిరిగి కలుసుకున్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:సినిమా హిట్ అవ్వాలంటే మంచి కథ కంపల్సరీ అనే రూల్ లేదు.ఇదే విషయం ఇంతకుముందు వచ్చిన అనేక సినిమాలు ప్రూవ్ చేసాయి.కాకపోతే ఉన్న పలుచటి కథ గురుంచి ప్రేక్షకుడు ఆలోచించే సమయం లేకుండా క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ తో ఎంగేజ్ చెయ్యాలి.అనుక్షణం గిలిగింతలు పెట్టాలి.ఈ ఫార్ములాని బాగా వంటబట్టించుకున్న అనిల్ రావిపూడి F2 సినిమాకి ఇదే ఫార్ములాను పర్ఫెక్ట్ గా అప్లై చేసాడు.అతని రైటింగ్ స్కిల్స్ అండ్ కామెడీ టైమింగ్ కి వెంకీ,వరుణ్ లాంటి నటులు తోడయ్యారు.మిగతా పాత్రలు కూడా కామెడీ తో చెలరేగి F2 ని హిలేరియస్ ఎంటెర్టైనెర్ గా మలిచారు.ఫస్ట్ హాఫ్ ఫుల్ రేంజ్ కామెడీ డోస్ తరువాత సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త నెమ్మదించినట్టు అనిపించినా కూడా మళ్ళీ ప్రీ క్లయిమాక్స్ నుండి విజృంభించి హిట్ మెట్టుపై నిలబడింది.హిట్ కొట్టాలి అని టీమ్ అంతా కసిగా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేదానికి F2 ఉదాహరణగా నిలిచింది.

నటీనటులు:గతంలో టిపికల్ కామెడీ టైమింగ్ తో భారీ విజయాలు సొంతం చేసుకున్న వెంకటేష్..ఈ మధ్య కాలంలో ఎక్కువ సీరియస్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. కానీ అతనిలోని ఆ హిలేరియస్ స్పార్క్ తిరిగి చూడాలనుకున్న అనిల్ రావిపూడి వెంకీకి టైలర్ మేడ్ లా ఉండే ఫ్రస్టేటెడ్ హజ్బెండ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు.అనిల్ రాసుకున్న ఆ పాత్రను , డైలాగ్స్ ని తన స్టైల్ తో పదిరెట్లు పెంచుతూ..హిలేరియస్ కామెడీతో సినిమాని అలవోకగా అవుట్ ఆఫ్ డేంజర్ జోన్ లోకి తెచ్చేశాడు వెంకటేష్.ఇక ఈ మధ్య వరుస విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ తెలంగాణ యాసతో సగటు కుర్రాడిగా బాగా నటించాడు.కామెడీ టైమింగ్ లో వెంకీని మ్యాచ్ చెయ్యలేకపోయినా.. ఫుల్ సపోర్ట్ గా నిలిచాడు.వరుణ్ వల్ల సినిమా రేంజ్ పెరిగింది.రాజేంద్ర ప్రసాద్ తనకు అలవాటైన పాత్రను మరోసారి అలవోకగా పోషించి మెప్పించాడు. ఇక తమన్నా,మెహ్రీన్ ల గ్లామర్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.వెంకీ,వరుణ్ లతో వాళ్ల కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ పై పర్ ఫెక్ట్ గా వర్కవుట్ అయ్యింది.ప్రకాష్ రాజ్,నాజర్, పృధ్వి,ప్రగతి,ఈశ్వరీ రావు,రఘబాబు,అన్నపూర్ణ, వై.విజయ కనిపించిన ప్రతిసారీ కడుపుబ్బా నవ్వించారు. మిర్చి కిరణ్ క్యారెక్టర్ పేల్చిన పంచ్ లు బావున్నాయి. బిగ్ బాస్ సెలబ్రిటీ నూతన్ నాయుడు, హరితేజ, శ్రీనివాసరెడ్డి కూడా కామెడీ కలరింగ్ తెచ్చారు.ఇక చివరిలో ఎంట్రీ ఇచ్చిన వెన్నెల కిషోర్ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా…F2 కి ఫుల్ ఫిల్ మెంట్ ఇచ్చాడు. తన ఎండ్ పంచ్ తో సినిమాకి ఎండ్ కార్డ్ పడింది.ప్రియదర్శి తెలంగాణ యాసలో పేల్చిన పంచ్ లు పటాసుల్లా పేలాయి.చాలా కాలం తర్వాత అతని కామెడీ వర్కవుట్ అయ్యింది.

టెక్నీషియన్స్:తన మొదటి సినిమా నుంచి కూడా కామెడీ ఎలివేషన్స్ లో తన ప్రత్యేకతను చాటుకుంటూ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాలో కూడా కన్ఫ్యూజన్ లేని సింపుల్ స్టోరీ లైన్ ని ఎంచుకున్నాడు. తన ట్రీట్మెంట్ తో తనకు బలంగా నిలిచిన కామెడీ డైలాగ్స్ తో సినిమాని ఆద్యంతం నవ్వులు పూయించేలా మలచగలిగాడు.ఫస్టాఫ్ వరకూ భారం మొత్తం వెంకటేష్ మోయడంతో, సినిమా ఉరకలెత్తే కామెడీతో పరుగులు తీసింది.ఇంటర్వెల్ తర్వాత మాత్రం అనీల్ రొటీన్ పాయింట్ ని టచ్ చెయ్యడంతో..కాస్త నెమ్మదించినా.. క్లైమాక్స్ మాత్రం సినిమాకి పర్ ఫెక్ట్ కామెడీ కంక్లూషన్ గా నిలిచింది.సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ ని తెచ్చింది. అలాగే కామెడీ కటింగ్స్ కి అతని అనుభవం బాగా పనికొచ్చింది.ముఖ్యంగా ఎబ్రాడ్ సీన్స్ లో సమీర్ రెడ్డి కెమెరా వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సినిమాకి మ్యూజిక్ తో పెద్దగా అవసరం పడకపోవడంతో..మామూలు ట్యూన్స్ అందించాడు దేవీ శ్రీ ప్రసాద్. ఆర్.ఆర్ పరంగా కేర్ తీసుకున్నాడు. ఎడిటింగ్ పర్ ఫెక్ట్ గా కుదిరింది. శిరీష్ నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి.

ఫైనల్ గా:ముందునుండీ కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్తూ వచ్చిన F2..ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే కామెడీతో కుటుంబం అంతా కలిసి చూడదగ్గ ఎంటర్ టైనర్ గా ప్రశంసలు దక్కించుకుంది. పొంగల్ విన్నర్ అని అందరూ పొగిడేస్తున్న F2 పండగ అండతో బాక్సీఫీస్ దగ్గర అద్భుతాలు చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది.