RRR లో హీరోయిన్స్ వీళ్ళే

108
Daisy Edgar Jones alia bhatt RRR
Daisy Edgar Jones alia bhatt RRR

RRR ప్రెస్ మీట్ లో డైరెక్టర్ రాజమౌళి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసాడు.ఈ సినిమాలో ఇద్దరు హీరోల పేర్లు రివీల్ చేసారు.చరణ్ పేరు అల్లూరి సీతారామరాజు కాగా ఎన్టీఆర్ పేరు కొమరం భీం.ఒక హీరోకి ఆంధ్రా ప్రాంత వీరుడు,మరొక హీరోకి తెలంగాణ వీరుడి పేరు పెట్టి అక్కడే ఫుల్ మర్క్స్ స్కోర్ చేసాడు రాజమౌళి.ఇక అందరికి తెలిసిన వీరి గురించి ఎవ్వరికి తెలియని చరిత్రని ఊహించి రాసుకుని దాన్ని తెరపై ఆవిష్కరించడం అనే ఆలోచనకే వెయ్యి కోట్లు కొల్లగొట్టగల సత్తా ఉంది.

ఇక రామరాజు సీతారామరాజు గా మారాడు.అలా తన బావ పేరులో శాశ్వత స్థానం సంపాదించుకున్న సీత పాత్రని బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తో చేయిస్తున్నారు.ఇక బీమ్ పాత్రలో కనిపిస్తున్న తారక్ కోసం బ్రిటిష్ మోడల్ కమ్ హీరోయిన్ అయిన డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.ఇక బాలీవుడ్ బడా హీరో అజయ్ దేవగన్,తమిళ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన సముద్ర ఖని కూడా ఈ సినిమాలో చాలా ప్రోమినెంట్ రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ ప్రెస్ మీట్ వల్ల ఎన్టీఆర్,చరణ్ ఇద్దరూ కూడా హీరో పాత్రలే పోషిస్తున్నారు అని తెలుస్తుంది.ఇక అజయ్ దేవగన్ కూడా విలన్ పాత్ర పోషించలేదు అనే క్లారిటీ కూడా ఇచ్చాడు జక్కన్న.ఓవర్ ఆల్ గా ఒకే ఒక్క ప్రెస్ మీట్ RRR గురించి క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చేసింది