రివ్యూ : ‘సుబ్రహ్మణ్యపురం’ – అలరించే సప్సెన్స్ థ్రిల్లర్

621
Subrahmanyapuram
Subrahmanyapuram

విడుదల తేదీ : డిసెంబర్ 07, 2018

CB  రేటింగ్ : 3.2/5

నటీనటులు : సుమంత్, ఈషా రెబ్బా, సాయి కుమార్, సురేష్, అమిత్ శర్మ, భద్రమ్ తదితరులు.

దర్శకత్వం  : సంతోష్ జాగర్లపూడి

సంగీతం : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫర్ : ఆర్ కె ప్రతాప్

స్క్రీన్ ప్లే :  సంతోష్ జాగర్లపూడి

ఎడిటింగ్: కార్తికేయ శ్రీనివాస్

నిర్మాత:   భీరం సుధాకర్ రెడ్డి.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లగా వచ్చిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. శేఖర్ చంద్ర సంగీతం అందించిన  ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును  ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

నాస్తికుడైన  సుమంత్ దేవాలయాల పరిశోధకునిగా పని చేస్తుంటుంటాడు. అదే సందర్భంలో హీరోయిన్ ఈషా రెబ్బాను ఇష్టపడతాడు. ప్రేమ కోసం ఆమె వెంట పడుతూ  సరదాగా ఆట పట్టిస్తుంటాడు. ఈ క్రమంలో మరో పక్క సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో ఆత్మహత్యలు జరుగుతుంటాయి.  ఆ  తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తరువాత అసలు  సుబ్రహ్మణ్యపురంలో  ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ?  ఆ  సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక ఉన్న రహస్యం ఏమిటో ? మొత్తం  పది రోజుల్లో ఛేదిస్తానని  సుమంత్ ఛాలెంజ్ చేస్తాడు.  మరి..  సుమంత్ ఆ ఛాలెంజ్ ని  ఛేదించడంలో విజయం సాధించాడా..? లేదా ?  అయినా సుబ్రహ్మణ్యపురంలో అసలు ఆత్మహత్యలు  ఎందుకు జరుగుతున్నాయి. దీని వెనుక  ఎవరెవరు ఉన్నారు ? చివరకి సుమంత్ ఈ ఆత్మహత్యలకు పరిష్కారం చూపించాడా ? లేడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లగా వచ్చిన ఈ  చిత్రం అక్కడక్కడా కొంత నెమ్మదించినప్పటికీ  మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ముందుగా రానా వాయిస్ ఓవర్ తో మరియు టైటిల్స్ పడటంతోనే చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఎంచుకున్న కథ కొత్తగా అనిపించినా ఇది వరకే వచ్చిన కార్తికేయ షేడ్స్ ఈ చిత్రంలో కనిపించినట్టుగా ప్రేక్షకులు ఫీల్ అవుతారు.హీరో సుమంత్ ఆ గ్రామంలో జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న రహస్యాన్ని చేధించే పాత్రలో తనదైన నటన కనబర్చారు.  సాఫీగా సాగుతున్న ఫస్టాఫ్ లో కొన్ని ఊహించని సంఘటనల ద్వారా సెకండాఫ్ మీద మరింత ఆసక్తిని కనబరుస్తాయి.ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి కూడా ఇంకా ఆ ఆసక్తి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.దీనితో అసలు ఏం జరుగుతుంది అన్న విషయం పై ప్రేక్షకుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది.  అక్కడక్కడా వచ్చిన కామెడీ సన్నివేశాలు పర్వాలేదనిపించాయి.

ఇక దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అలాగే సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల తాలూకు సన్నివేశాలు   కూడా ఆయన ఆకట్టుకునే విధంగా మలిచారు. కానీ పూర్తీ స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు.   దీనికి తోడు  సినిమాలో కొన్ని  కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా  అనిపిస్తాయి. పైగా సినిమాలో కొన్ని  సన్నివేశాలు స్లోగా సాగుతాయి.  కథలోని మెయిన్ ఎమోషన్ ఇంకా బలంగా ఎలివేట్  అవకాశం ఉన్నట్లు అనిపించడం,  సుబ్రహ్మణ్యపురంలో  ఆత్మహత్యలు జరగడానికి బలమైన  కారణాలను  అంతే బలంగా చూపించపోవడం  వంటి అంశాలు  సినిమా డ్రా బ్యాగ్స్ గా నిలుస్తాయి.

నటీనటులు :

సుమంత్ ఈ సినిమాలో నాస్తికుడిగా మరియు  దేవాలయాల పరిశోధకుడిగా  చక్కని నటనను కనబరిచాడు. హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో కూడా సుమంత్ తన నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే  సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల రహస్యాన్ని చేధించే సన్నివేశాల్లో కూడా  సుమంత్ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో  హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.  ఇక కథానాయకిగా నటించిన  ఈషా రెబ్బా  ఎప్పటిలాగే  తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా  తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా   ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. అలాగే ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన సాయి కుమార్  తన గాంభీరమైన నటనతో మెప్పించారు.  మరో కీలక పాత్ర అయిన హీరోయిన్ ఫాదర్ గా నటించిన సురేష్ కూడా చాలా బాగా నటించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లోనూ సురేష్ నటన చాలా బాగుంది. ఇక కమెడియన్ భద్రమ్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేయగా.. మిగిలిన నటీనటులు కూడా  తమ పాత్ర పరిధి మేరకు  బాగా నటించారు.

టెక్నీషియన్స్:

దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మంచి కాన్సెప్ట్ తీసుకున్నా.. ఆ కాన్సెప్ట్ కి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోకలేదు. అయితే దర్శకుడు  సినిమాని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు.  ఆర్ కె ప్రతాప్  సినిమాటోగ్రఫీ  బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర  అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. కార్తికేయ శ్రీనివాస్  ఎడిటింగ్ సినిమాకి తగ్గట్లే ఉంది.  సినిమాలోని నిర్మాత  పాటించిన  ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదనిపిస్తాయి.

చివరిగా :

మొత్తానికి ఈ సినిమా దర్శకుడు తాను అనుకున్నది చిన్న చిన్న లోపాలతో ఈ చిత్రాన్ని  తీర్చిదిద్దినా.. బాగానే ఆకట్టుకున్నాడు.  అలాగే సుమంత్ తన ప్లాపుల కెరీర్ లోనుంచి తేరుకోవడానికి కష్టపడుతున్న తీరు మెచ్చుకోదగినదే, ఈ చిత్రంతో సుమంత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అనే చెప్పాలి. అయితే సుబ్రహ్మణ్యపురంలో  ఆత్మహత్యలు జరగడానికి బలమైన  కారణాలను  అంతే బలంగా చూపించి ఉంటే బాగుండేది.  ఓవరాల్ గా ఈ  ‘సుబ్రహ్మణ్యపురం’ అలరిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పంచ్ లైన్ :  ‘సుబ్రహ్మణ్యపురం’ –  అలరించే సప్సెన్స్ థ్రిల్లర్