NGK :మళ్ళీ అదే దారి

48
Suriya, Sai Pallavi, Rakul Preet
Suriya, Sai Pallavi, Rakul Preet

తమిళ్ హీరో సూర్య కి తెలుగులో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది.ఆల్మోస్ట్ తెలుగు హీరోలతో సమానమయిన క్రేజ్ ఉంది.అయితే గత కొంతకాలంగా సరయిన హిట్ ఇవ్వలేక ఇబ్బందిపడుతున్న సూర్య సెల్వరాఘవన్ తో కలిసి NGK అనే సినిమా చేసాడు.వీళ్ళ కాంబినేషన్ పెద్ద సంచలనంగా మారింది.NGK ..నందగోపాల కృష్ణ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని కూడ ఈ మధ్య బాగా విజయం సాధిస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కి లింక్ అప్ చేసారు.రైతు రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది?,ఆ తరువాత ఏం జరిగింది అనేది సినిమా కథ.

ఈ చిన్న టీజర్ తోనే సినిమాలో ఉన్న స్టఫ్ పై డిస్కషన్స్ మొదలయ్యాయి.ఇక టాప్ హీరోయిన్స్ అయిన రకుల్ ప్రీత్,సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించడం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది.యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వైబ్రoట్ గా ఉంది.ఓవర్ ఆల్ గా ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.సూర్య కెరీర్ లో మరో హిట్ అందించే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి అని ఈ టీజర్ తో తెలుస్తుంది.ఈ సినిమా గురించి మరింత క్లారిటీ రావాలంటే ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.ట్రైలర్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేసి సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు.