వినయ విధేయ రామ’ లేటెస్ట్ కృష్ణా అండ్ నైజాం కలెక్షన్స్ !!

121
ram charan

‘ధృవ’, ‘రంగస్థలం’ లాంటి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ మొట్ట మొదటిసారి ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన మాస్ ఎంటర్ టైనర్ ‘వినయ విధేయ రామ’. జనవరి 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబడుతూ… బి,సి సెంటర్లలో దూసుకుపోతుంది. ఐతే పండుగ సీజన్ కూడా ముగియడంతో ఇక అంతా కలెక్షన్స్ తగ్గుతాయని అనుకున్నారు. కానీ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపడేలా ఫస్ట్ వీక్ లో ఏపి, తెలంగాణలో 50 కోట్ల షేర్ ను వసూళ్లు చేసింది. ముఖ్యంగా సీడెడ్, నైజాంతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఈ చిత్రం బాగానే రాబట్టింది. ఎలాగూ విడుదలకు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ చూశారు.

కాగా ఇక లేటెస్ట్ కలెక్షన్స్ విషయానికి వస్తే… నైజాం ఏరియాలో ‘వినయ విధేయ రామ’ గురువారం నాడు రూ 35 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. అలాగే నైజాంలో మొత్తం ఫస్ట్ వీక్ గానూ సుమారు 12.10 కోట్లు షేర్ ను వసూళ్లు చేసింది. ఇక కృష్ణా జిల్లా విషయానికొస్తే గురువారం 20,08,309/- లక్షల షేర్ ని వసూలు చేసింది. దీంతో మొత్తం 7 రోజులకు గానూ కృష్ణా జిల్లాలో 3,45,51,323/- కోట్ల షేర్ ను వసూలు చేసింది.

అయితే వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ కెరీర్ మాత్రం ‘వినయ విధేయ రామ’ ఏ మాత్రం ఉపయోగపడకపోగా చరణ్ విజయ పరంపరకు బ్రేకులు వేసినట్లు అయింది. దానికి తోడు ఎప్పుడూ లేనంతగా ‘వినయ విధేయ రామ’ పై, దర్శకుడు బోయపాటి పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా మనిషి తలలను గ్రద్దలు ఎత్తికెళ్లిపోయే లాంటి సన్నివేశాల పై నెటిజన్లు బ్యాడ్ గా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి బి.సి ప్రేక్షకుల కోసం సినిమాలు తీసే బోయపాటికి ఈ చిత్రం బ్యాడ్ ఎక్స్ పిరియన్స్ ని మిగిలించిందనే చెప్పాలి.