‘యాత్ర’ ఫస్ట్ డే కలెక్షన్స్ !

62
Yatra First Day Collections!
Yatra First Day Collections!

రైతుల నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించిన సినిమా ‘యాత్ర’. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఈ సినిమాను 970 థియేటర్లలో విడుదల చేశారు. మొత్తానికి ప్రేక్షకుల మనసును వైఎస్సార్ బయోపిక్ బాగానే గెలుచుకుంది. పైగా ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొదటిరోజు మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2. 76 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే యూఎస్ ప్రీమియర్ షోలతో ఈ చిత్రం 71,289 డాలర్లను వసూలు చేసినట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. తమిళ, మలయాళ భాషల్లో కూడా మమ్ముట్టికి మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో అక్కడ కూడా మంచి వసూళ్లును కలెక్ట్ చేసింది.

పేదవాడి బాధలను తీర్చడానికి రైతుల కన్నీళ్లను తుడవడానికి క‌డ‌ప దాటి పాదయాత్ర పేరుతో ప్ర‌తి గ‌డ‌ప‌లోకి వెళ్లారు దివంగ‌త నేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు. నిజానికి వైఎస్సార్ రాజ‌కీయ జీవితంలో ‘పాదయాత్ర’ ఎంతో కీల‌క‌మైనది. అలాగే తెలుగు రాజకీయాల పై కూడా తీవ్ర ప్రభావం చూపింది వైఎస్సార్ పాదయాత్ర. కాగా పాదయాత్ర చేస్తోన్న సమయంలో వైఎస్సార్ చూసిన సంఘటనలను, అలాగే ఆయనకు ఎదురైన అనుభవాలను మహి.వి.రాఘవ్ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. మమ్ముట్టి ఆ పాత్రలో ఒదిగిపోయారు.