పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం – ప్ర‌ధాని మోదీ

40
Narendra Modi
Narendra Modi

కశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతామని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ హాజరయ్యారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై ఈ స‌మావేశంలో చర్చించారు.

పాకిస్తాన్‌ చాలా పెద్ద తప్పు చేసిందని, దాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ప్ర‌ధాని మోదీ. పుల్వామాలో ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందన్నారు ప్ర‌ధాని. ఇలాంటి దాడులతో భారతదేశ సమగ్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. మానవతావాదులంతా ఏకమై ఉగ్రవాదులపై పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి రావాలన్నారు. ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడదామన్నారు. సైనికుల ధైర్యం, త్యాగాలు వెలకట్టలేనివని అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ .