నిజామాబాద్ లో ప‌వ‌ర్ చూపిన ప‌సుపు రైతులు

84
farmers filed their nominations in Nizamabad
farmers filed their nominations in Nizamabad

నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో రైతులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యే సమయానికి ఈ నియోజకవర్గంలో 245 నామినేషన్లు దాఖ‌లు చేశారు. తుదిరోజున సోమవారం ఒక్కరోజే 182 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకే నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవడం నిజామాబాద్‌ జిల్లాలో ఇదే తొలిసారి. నిజామాబాద్‌లో ఎర్రజొన్న, పసుపు రైతులు భారీ ఎత్తున నామినేషన్లు వేశారు. మార్చి 18 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంబం అయింది.

20న ఏడుగురు, 22న 56 మంది నామినేషన్లు వేశారు. 23,24 తేదీలు సెలవులు కావడంతో 25న చివరి రోజున రైతులు భారీ గా తరలివచ్చారు. 22న నామినేషన్లు వేసేందుకు వచ్చిన రైతుల పట్ల ఎన్నికల అధికారులు కొంత నిర్ల క్ష్యం, దురుసుగా ప్రవర్తించ‌డంతో అక్కడి నుంచే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫోన్‌ ద్వారా రైతులు ఫిర్యాదు చేశారు . స్పందించిన ఎన్ని కల సంఘం అధికారులు ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సోమవారం రోజున నామినేషన్ల స్వీకరణకు 4 కౌంటర్లను అద‌నంగా ఏర్పా టు చేశారు. దీంతో నామినేష‌న్‌ల గ‌డువు ముగిసే స‌మ‌యానికి నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో రైతులు 245 నామినేషన్లు దాఖ‌లు చేశారు. ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు త‌ర్వాత బ‌రిలో నిలిచే అభ్య‌ర్ధులు అదికంగా వుంటే బ్యాలెట్ ప‌త్రాల‌తో పోలింగ్ జ‌రిగే అవ‌కాశాలున్నాయి.

[wbcr_snippet]: PHP snippets error (not passed the snippet ID)