ABCD కి మోక్షం ఎప్పుడు?

66
Allu Sirish, ABCD Movie
Allu Sirish, ABCD Movie

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ABCD సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని చాలా రోజులయింది.కానీ ఇంతవరకు ఆ సినిమా రిలీజ్ కి సంబందించిన క్లారిటీ మాత్రం లేదు.గీత ఆర్ట్స్ సినిమాలు కానీ,లేదా బన్నీ,శిరీష్ ల సినిమాలు కానీ షూటింగ్ కి వెళ్లాలంటేనే ఆ స్క్రిప్ట్ కి అల్లు అరవింద్ ఆమోద ముద్ర కంపల్సరీ.ఇక ఆ సినిమా పూర్తయ్యాక ఫైనల్ కాపీ కి కూడా అరవింద్ సూచనలు,సలహాలు మ్యాండేటరీ.అయితే ఇప్పడు అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న ABCD సినిమా షూటింగ్ పూర్తయింది.మలయాళంలో హిట్ అయిన అమెరికన్ బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశీ (ABCD) ని పేరు కూడా మార్చకుండా మక్కికి మక్కి దించారు.

కానీ ఆ సినిమాకి కూడా గీత ఆర్ట్స్ క్రియేటివ్ టీమ్ క్లియరెన్స్ కావాల్సి వచ్చింది.అది పూర్తయింది.ఇంకా అల్లు అరవింద్ నుండి క్లియరెన్స్ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాకి మరొక పెద్ద స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది.అదే సురేష్ బాబు.అల్లు అరవింద్ తో పాటు సురేష్ బాబు కూడా ఈ సినిమా చూసి ఓకే అనాలి.ఎందుకంటే ఆయన్ని కూడా ఒక ప్రొడ్యూసర్ గా చేర్చుకున్నారు కాబట్టి.సో,ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేలోపు వేసవికాలం కూడా వెళ్లిపోయేలా ఉంది.ఆ సినిమా ఒరిజినల్ లో హిట్ కంటెంట్ ఉంది.దాన్ని సోల్ చెడకొట్టకుండా ఉన్నది ఉన్నట్టు తీసినా సినిమా హిట్ అవుతుంది,ఇప్పడు సీజన్ డల్ గా ఉంది…అందుకే వీలైనంత త్వరగా ఈ సినిమా రిలీజ్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది.అలా కాకుండా రీ షూట్ లు,కరెక్షన్స్ అంటే మాత్రం ఈ చిన్న సినిమా హిట్ అయినా ఉపయోగం ఉండదు.

[wbcr_snippet]: PHP snippets error (not passed the snippet ID)