లివ్ఇన్ రిలేష‌న్ షిప్ మీద సాగే సినిమా `ఇష్టంగా`

124
Arjun Mahi
Arjun Mahi

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి రుద్ర‌ దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం `ఇష్టంగా`. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. స్టార్ క‌మెడియ‌న్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నారు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతోంది‌. ఈసంద‌ర్భంగా హీరో అర్జున్ మ‌హి మీడియాతో మాట్లాడుతూ….ఆయ‌నే ఇన్‌స్పిరేష‌న్‌..

– నాకు చిరంజీవిగారే ఇన్‌స్పిరేష‌న్‌. అలాగే నేటి త‌రం హీరోలంద‌రినీ ఇష్ట‌ప‌డ‌తాను. అంద‌రి సినిమాలు చూస్తుంటాను. ఇంజ‌నీరింగ్ చ‌దివిన త‌ర్వాత సినిమాల‌పై చిన్న‌ప్ప‌టి నుండి ఉన్న ఆస‌క్తితో హీరో అయ్యాను. క‌ష్టంగా.. ఇష్టంగా…

– హీరోగా ఎంజాయ్‌, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ సినిమా త‌ర్వాత చేసిన మూడో సినిమా. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది. ఇందులో త‌నిష్క్ రాజ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తే మ‌ధుమ‌తి, మ‌ధ‌నంద‌న్‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అందరం క‌ష్ట‌ప‌డ్డా ఎంతో ఇష్టంగా చేసిన సినిమా.
పాత్ర గురించి…

– సినిమాలో కృష్ణ అనే కొరియోగ్రాఫ‌ర్ పాత్ర‌లో న‌టించాను. హీరోయిన్ ఓ వెబ్‌సైట్‌లో కంటెంట్ రైట‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అనే కాన్సెప్ట్ న‌డుస్తుంది. మా సినిమా ట్రైల‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్ చూసినవాళ్లంద‌రూ అర్జున్ రెడ్డి 2, ఆర్‌.ఎక్స్ 100 సీక్వెల్‌లా ఉంద‌ని అన్నారు. సినిమా ప్రేమ మీద‌, లివిన్ రిలేష‌న్ షిప్ మీద కొన‌సాగుతుంది. ఒక అమ్మాయి ప్రేమిస్తే .. ప్రేమ కోసం ఎంత దూరం వెళుతుంద‌నేది ఈ సినిమాలో చూపించాం.
వ‌ల్గ‌ర్‌గా ఉండ‌దు…

– లివ్ ఇన్ రిలేష‌న్ మీద ర‌న్ అయ్యే క‌థ కాబ‌ట్టి.. క‌థానుగుణంగా లిప్‌లాక్స్ ఉంటాయి. ఎక్క‌డా వ‌ల్గారిటీ ఉండ‌దు. సినిమాలో సెకండాఫ్‌లో చివ‌రి ముప్పై నిమిషాలు ఓ కోర్ పాయింట్ మీద సినిమా ర‌న్ అవుతుంది. ఆ కోర్ పాయింట్ ఏంట‌నేది ఇప్పుడే చెప్ప‌లేను.
త‌దుప‌రి చిత్రాలు..

– రెండు మూడు క‌థ‌లు విని ఉన్నాను.. `ఇష్టంగా` సినిమా రిలీజ్ త‌ర్వాత త‌దుప‌రి సినిమాపై నిర్ణ‌యం తీసుకుంటాను.

[wbcr_snippet]: PHP snippets error (not passed the snippet ID)