ఫ్యాను కింద‌కు పెద‌రాయుడు ..!

67
Mohan babu, YSRCP, YS Jagan
Mohan babu, YSRCP, YS Jagan

ఎన్నిక‌ల వేళ ఫ్యాను కింద‌కు పెద‌రాయుడు వ‌చ్చారు. విల‌క్ష‌ణ నటుడు, నిర్మాత మోహన్‌బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గూటిలో చేరారు. తన కుమారుడు మంచు విష్ణుతో కలసి లోటస్‌ పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి చేరుకున్న మోహన్‌బాబు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ బాబును పార్టీలోకి ఆహ్వానించారు. త‌న కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పై మోహన్ బాబు నిరసనలకు దిగి, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇటీవ‌ల మోహ‌న్ బాబు విమర్శించారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ తరపున మోహన్‌బాబు ఎన్నికల ప్రచారం కూడా చేసేందుకు స‌మాయ‌త్తం అయిన‌ట్లు తెలిసింది.

ఏపీలో వైసీపీ అధినేత జగన్‌ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారన్నారు మోహ‌న్ బాబు . తాను పదవులు ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. జగన్‌ సీఎం అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. అయితే మోహన్ బాబుకు రాజ్యసభ సీటు ఇచ్చి, పార్లమెంట్ కు పంపాలని జగన్ భావిస్తున్నట్టు స‌మాచారం.

[wbcr_snippet]: PHP snippets error (not passed the snippet ID)