అన్ని సీట్లు తామే గెలుస్తామ‌ని మంత్రి లోకేష్ జోస్యం

41
Nara Lokesh
Nara Lokesh

రెండు తెలుగు రాష్ట్రాల‌ మధ్య చిచ్చు పెట్టేందుకు ఏపీ ప్రతిపక్ష నేత జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారని మంత్రి లోకేష్ ఆరోపించారు. విజయవాడలో భవనీపురం వాటర్ వర్క్స్ దగ్గర నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో ఆయ‌న పాల్టొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు దండగ అని చెప్పిన ఏకైన వ్యక్తి జగనేనని విమర్శించారు లోకేష్. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు చెందిన పులివెందుల నియోజకవర్గంలో కూడా టీడీపీనే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

[wbcr_snippet]: PHP snippets error (not passed the snippet ID)