నితిన్ వరుసబెట్టి ఓపెనింగ్స్…సినిమాలెప్పుడు?

86
Nithin
Nithin

కెరీర్ మొదట్లో మంచి విజయాలే అందుకున్న నితిన్ ఆ తరువాత మాత్రం ట్రాక్ తప్పి వరుసగా ప్లాప్ సినిమాలే చేస్తూ పదేళ్లు గడిపేశాడు.కానీ విక్రమ్.కే.కుమార్ తో చేసిన ఇష్క్,విజయ్ కుమార్ కొండా తో చేసిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో నితిన్ కెరీర్ మరింత ముందుకు వెళ్ళింది.కానీ సక్సెస్ రావడంతో స్పీడ్ పెంచాలి అని ఫిక్స్ అయిన నితిన్ ఆ క్రమంలో స్టోరీ సెలెక్షన్ ని పెద్దగా పట్టించుకోలేదు.

మధ్యలో అ…ఆ రూపంలో భారీ హిట్ వచ్చినా కూడా ఆ క్రెడిట్ లో నితిన్ కి కనీసం వాటా కూడా దక్కలేదు.కాంబినేషనన్ ని నమ్మకుని చేసిన లై,చల్ మోహన్ రంగ సినిమాలు కాస్ట్లీ డిజాస్టర్స్ గా మారాయి.ఇక దిల్ రాజు సెలెక్షన్ ని నమ్ముకుని చేసిన శ్రీనివాసకళ్యాణం కూడా వెడ్డింగ్ క్యాసెట్ అనే క్యాప్షన్ ని దక్కించుకుంది.ఇలా ఏ జోనర్ లో సినిమా చేసిన కూడా హిట్ దక్కకపోవడంతో నితిన్ ఫుల్ డైలమా లో ఉన్నాడు.వరుసగా ఏ పాయింట్ ఎక్సయిట్ చేసిన ఆ డైరెక్టర్ కి సినిమా చేస్తా అంటూ మాట ఇచ్చేస్తున్నాడు.అలా మాట ఇచ్చే ఛలో తో హిట్ అందుకున్న వెంకీ కుడుములు లాక్ చేసాడు.సినిమా పేరు భీష్మ,హీరోయిన్ రష్మిక…అంతకుమించి ఆ ప్రాజెక్ట్ లో ఇప్పటువరకు వేరే అప్డేట్స్ ఏమీ లేవు.ఆ సినిమా ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది అన్న క్లారిటీ కూడా లేదు.

ఈ మధ్య గుండెజారి గల్లతయ్యిందే సినిమా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా తో జర్నీ స్టార్ట్ చేశాడు.సో,అతనితో సినిమా ఉంటుంది.కానీ ఎప్పుడో తెలియదు.ఈలోగా ప్లాప్ డైరెక్టర్ గా పేరున్న రమేష్ వర్మ తనే నితిన్ తో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు.అది జరిగి ఒకరోజు కూడా గడవకుండానే చంద్ర శేఖర్ ఏలేటి తో ఒక సినిమా చేస్తునట్టు అనౌన్స్ చేసాడు.అసలు ఇన్ని సినిమాలు అనౌన్స్ చేస్తున్న నితిన్ ఫ్రస్ట్రేషన్,కన్ఫ్యూషన్ అతనికి తప్ప మిగతా అందరికి అర్ధమవుతుంది.పక్కాగా హిట్ ఇచ్చే సినిమా కథ కుదిరాక,దాన్ని అనౌన్స్ చేసి హడావిడి లేకుండా సెట్స్ కి వెళితే సరిపోయేదానికి అనవసరంగా రభస క్రియేట్ చేస్తున్నాడు.అసలు వీటిలో ఏ సినిమా ఉంటుందో,ఏ సినిమా క్యాన్సిల్ అవుతుందో అన్న క్లారిటీ ఆయా సినిమాల డైరెక్టర్స్ కే లేకపోవడం విశేషం.

[wbcr_snippet]: PHP snippets error (not passed the snippet ID)