ఒకేసారి రెండు సినిమాతో వస్తున్న సమంత

105
Samantha Akkineni Majili Super Deluxe
Samantha Akkineni Majili Super Deluxe

సమంత పెళ్ళయినా కూడా అర్ధవంతమయిన సినిమాలు,ఛాలెంజింగ్ రోల్స్ తో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది.గత సంవత్సరం వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్న సమంత ఈ సంవత్సరం కూడా సమ్మర్ లోనే ప్రేక్షకులను పలకరించబోతుంది.

2018 లో కూడా చాలా తక్కువ టైం లోనే రంగస్థలం,మహానటి లాంటి మరపురాని విజయాలు అందుకున్నసమంత ఈ సంవత్సరం మాత్రం ఒకే వారం గ్యాప్ లో రెండు సినిమాలతో పలకరించబోతుంది.ఆమె నటించిన తమిళ్ మూవీ సూపర్ డీలక్స్ ఈనెiల 29 న ప్రేక్షకుముందుకు రాబోతుంది.అలానే ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది మజిలీ.

రెండు సినిమాల్లో కూడా సమంత కి మంచి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి.మజిలీ కి సమంత స్పెషల్ అట్రాక్షన్.మరి పోయిన సంవత్సరంలా ఈ సారి కూడా ప్రేక్షకులను మాయ చేసి రెండు సినిమాలతో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.ఇవి కాకుండా సమంత నటంచిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓ బేబీ కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ కాబోతుంది.సమంత సినిమాల లైన్ అప్ చూస్తుంటే ఆమెతో ఆమే పోటీపడుతున్నట్టు ఉంది.

[wbcr_snippet]: PHP snippets error (not passed the snippet ID)